Cash, arms seized during search ops at Dera HQ డేరాలో రెండు గదుల నిండా రూ.2 వేల నోట్లే..

Cash arms seized during search ops at dera hq

Haryana,Sirsa,sanitisation exercise, dera sacha sauda sect headquarters, gurmeet ram rahim singh, retired district and sessions judge

A mammoth exercise to carry out "sanitisation" of Dera Sacha Sauda sect headquarters was underway in Sirsa with security forces and various government depts coordinating closely amid tight security.

డేరాలో రెండు గదుల నిండా రూ.2 వేల నోట్లే..

Posted: 09/08/2017 04:49 PM IST
Cash arms seized during search ops at dera hq

తన ఇద్దరి శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ న్యాయస్థానం విధించిన 20 ఏళ్ల శిక్షను అనుభవిస్తుండగా, అతని డేరాలలో తొవ్విన కొద్ది చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. తన గది నుంచి డేరాలో మహిళా భక్తుల గదులకు వెళ్లేందుకు సోరంగాలను ఏర్పాటు చేసుకున్న విషయం వెలుగుచూసినప్పటి నుంచి డేరా సచ్ఛా సౌదా బాబా గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాబా కాదు నరరూప రాక్షసుడని సాక్ష్యాత్తు న్యాయస్థానమే వ్యాఖ్యానించిందంటే.. అతని అగడాలు ఎంతలా వున్నాయో అర్థమవుతుంది.

బాబా రామ్ రహీమ్ అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన డేరాలో బంధీలుగా వున్న 18 మంది మహిళలను విముక్తుల్ని చేయడం నుంచి ప్రారంభమైన పోలీస్ అపరేషన్.. ఆ తరువాత డేరాలో 500లకు పైగా అస్థిపంజరాలను కునుగోని విస్తుపోయారు. దీంతో డేరా అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్‌ దాఖలు కావటంతో ఛండీగఢ్‌ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి.
 
సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో 800 వందల ఎకరాల విస్తీర్ణంలోని డేరాలో కర్ఫ్యూ విధించారు. దీంతో సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ్ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. అపరేషన్ మొత్తాన్ని న్యాయవాది సమక్షంలో జరుగుతుండగా, మొత్తం సర్ఛ్ అపరేషన్ ను వీడియోలలో చిత్రీకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.
 
మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవాళ డేరాలో సోదాలు సందర్భంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డేరాలోని రెండు గదుల నిండా కొత్త కరెన్సీ లభించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వాటిలో రెండు వేల రూపాయల నోట్లే అధికంగా వున్నాయని సమాచారం. ఇక మరో గది నిండా మారణాయుధాలు బయటపడ్డాయని, గుర్మీత్ తో దందాలు నడిపించిన వారి వివరాలతో కూడిన హార్డ్ డిస్క్ లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గదులను సీజ్ చేసిన అధికారులు.. మరికొన్ని గదులలో తనిఖీలను చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dera Sacha Saudha  Sisra  Head Office  Search operations  Sirsa  Haryana  

Other Articles