EPS govt gives shock to ttv dinakaran, arrests dhanasekaran టీటీవి దినకరణ్ కు జలకిచ్చిన పళని సర్కార్..

Eps govt gives shock to ttv dinakaran arrests dhanasekaran

edapati palanisamy, chief minister, government, pannerselvam, rebel, ttv dinakaran, arrest, dhanasekaran, Tobacco (zarda) case. tamil nadu police, crime

Tamil Nadu edapati palanisamy Government gives shock to his rebel ttv dinakaran troop, arrests his party key leader dhanasekaran in banned zarda case.

టీటీవి దినకరణ్ కు జలకిచ్చిన పళని సర్కార్..

Posted: 09/07/2017 11:57 AM IST
Eps govt gives shock to ttv dinakaran arrests dhanasekaran

తమిళనాడులోని అధికార పార్టీలో రెబెల్ గా మారి గ్రూపు రాజకీయాలకు వేదికగా నిలుస్తున్న టీటీవీ దినకరణ్ బృందానికి ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి సర్కార్ జలక్ ఇచ్చింది. అచ్చంగా అర్కే నగర్ ఉపఎన్నికల సమయంలో అదాయపన్నుశాఖ అధికారులతో కేంద్రంలోని బీజేపి సర్కార్ దాడులను చేయింది.. ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిచేట్లు చేసుకుని.. పళిని, పన్నీరు వర్గాలను కలయిక కూడా చేయించినట్లుగా.. తాజాగా పళనిస్వామి కూడా అదే తరహా చతురతతో దినకరణ్ వర్గానికి షాక్ ఇచ్చారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.

తన వర్గంలో వున్న ఎమ్మెల్యేలతో పళని ప్రభుత్వాన్ని పడగొడతానని ధీమా వ్యక్తం చేసిన దినకరణ్ వర్గంలో పళని వణుకు పుట్టిస్తున్నారు. మత్తు పదార్థాలను విక్రయించిన కేసులో దినకరణ్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే ప్రముఖ నేత ధనశేఖరన్ ను అరెస్టు చేయించడంతో తానేం తక్కువ తిశారు. నార్త్‌ చెన్నై ప్రాంతాల్లో నిషేధం విధించబడిన మాదక ద్రవ్యాలను విక్రయించిన వారిని అరెస్టు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం వాషర్‌మెన్‌పేట సహాయ కమిషనర్‌ నేతృత్వంలో తండయారుపేట, వాషర్‌మెన్‌పేట, కొరుక్కుపేట, రాయపురం, కాశిమేడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో కొరుక్కుపేట కామరాజర్‌నగర్‌కు చెందిన ధనశేఖరన్‌(40) వద్ద సుమారు రూ.1.50 లక్షల విలువైన 300 కిలోల జర్దా, 50 కిలోల మావాలను పోలీసులు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ధనశేఖరన్‌ను అరెస్టు చేశారు. మత్తు పదార్ధాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరికి విక్రయించానే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధనశేఖరన్.. అన్నాడీఎంకే టీటీవీ దినకరన్‌ వర్గంలో కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు ఆయన విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే పార్టీలో పనిచేశారు. తర్వాత డీఎండీకే పార్టీని వదిలి అన్నాడీఎంకేలోకి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles