Khairtabad Ganesh Nimajjanam 2017 Completed

Khairtabad ganesh immersion at tank bund

Khairtabad Ganesh Nimajjanam, Khairtabad Ganesh Immersion 2017, Khairtabad Ganesh Nimajjanam Process, Khairtabad Ganesh Nimajjanam, Khairtabad Ganesh Immersion Rally

Khairtabad Ganesh Nimajjanam 2017 Process Completed Peacefully. Huge Crowd Attend in this Program.

ITEMVIDEOS:సాగరుడి ఒడికి ఖైర‌తాబాద్ మ‌హాగణపతి

Posted: 09/05/2017 03:01 PM IST
Khairtabad ganesh immersion at tank bund

హైద‌రాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. అశేష భక్తజన సందోహం నడుమ ఆ గ‌ణ‌నాథుడు హుస్సేన్ సాగర్ లో చేరిపోయాడు. దశాబ్దల చ‌రిత్ర‌లో రెండోసారి ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమ‌జ్జ‌నం మధ్యాహ్న‌మే ముగిసింది. గ‌తంలో అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఖైర‌తాబాద్ గ‌‌ణనాథుడి శోభాయాత్ర ప్రారంభ‌మ‌య్యేద‌న్న విష‌యం తెలిసిందే.

మ‌హాగ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే గతేడాది మధ్యాహ్నాని కల్లా ముగిసిన యాత్ర.. ఈసారి మాత్రం కాస్త ఆలస్యమయ్యింది. ఈ దర్శనం కోసం ట్యాంక్ బండ్ వ‌ద్దకు ఈ రోజు ఉద‌యం నుంచే భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు.

 

మ‌రోవైపు హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల నుంచి గ‌ణ‌నాథుడి విగ్ర‌హాలు ట్యాంక్‌బండ్ దిశ‌గా త‌ర‌లివ‌స్తున్నాయి. రేపు మధ్యాహ్నాం దాకా నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను కూడా చేసి పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles