కాకినాడ కోటలో పచ్చ జెండా.. వైకాపా ఖేల్ ఖతం? | TDP Huge victory in kakinafa By Poll

Ysrcp lost in kakinada corporation elections

Kakinada Muncipal Corporation Elections, Kakinada Muncipal Corporation Elections Results, Kakinada Muncipal Corporation Elections TDP, YSRCP Kakinada Lost

Kakinada Muncipal Corporation Elections Result,. TDP Huge Victory with 32 Along with BJP 3 total 35. YSRCP won 10 Seats only.

దారుణ ఓటమి.. వైసీపీకి ఇక నో ఫ్యూఛర్

Posted: 09/01/2017 03:08 PM IST
Ysrcp lost in kakinada corporation elections

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సొంతం చేసుకుంది. మొత్తం 50ల్లో 48 స్థానాలకు ఎన్నిక జరగ్గా, వీటిలో టీడీపీ, బీజేపీ కూటమికి 35 (32 3), వైకాపాకు 10, స్వతంత్ర్యులకు 3 వార్డులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురుకాగా, మరికొన్ని చోట్ల ఓట్లు కూడా ఆ పార్టీకి పోల్ కాలేదు.

విజయం పై చంద్రబాబు...

రెండు దశాబ్దాల తర్వాత కాకినాడ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవటం ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాకినాడను డెవలప్ చేసి తీరతామని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరో టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేజీ దివాకర్ రెడ్డి కూడా టీడీపీది ఘన విషయంగా అభివర్ణించారు.

‘వైసీపీకి నో భవిష్యత్తు.. నో భవిష్యత్తు.. అయిపోయింది దాని పని’ అంటూ దివాకర్ తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు తప్పవని అన్నారు. అయితే, ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకుంటారు, తీసుకోరనే విషయమై చంద్రబాబు ఆలోచించాల్సి ఉందని అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ విజయం ఊహించినదే అని, చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి కాకినాడ గెలుపే నిదర్శనమని అన్నారు. మరోవైపు ఓటమిపై ప్రతిపక్ష పార్టీ వైకాపా సైలెంట్ అయిపోయింది.

గెలిచిన అభ్యర్థుల వివరాలు..

డివిజన్ 1: పేరాబత్తుల లోవాబాబు (టీడీపీ)
డివిజన్ 2: సత్తిబాబు (టీడీపీ)
డివిజన్ 3: గుత్తుల అచ్చయ్యమ్మ (టీడీపీ)
డివిజన్ 4: పి సూర్యకుమారి (వైసీపీ)
డివిజన్ 5: సుజాత (బీజేపీ)
డివిజన్ 6: బండి సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 7: అంబటి క్రాంతి (టీడీపీ)
డివిజన్ 8: వరలక్ష్మి (టీడీపీ)
డివిజన్ 9: కే రమేష్ (వైసీపీ)
డివిజన్ 10: మోసా దానమ్మ (టీడీపీ)
డివిజన్ 11: జీ దానమ్మ (టీడీపీ)
డివిజన్ 12: కే సునీత (టీడీపీ)
డివిజన్ 13: బాల కామేశ్వరరావు (టీడీపీ)
డివిజన్ 14: వీ ఉమాశంకర్ (టీడీపీ)
డివిజన్ 15: చినగోటి సత్యబాబు (వైసీపీ)
డివిజన్ 16: మల్లాడి గంగాధర్ (టీడీపీ)
డివిజన్ 17: కే సత్యప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 18: సీ రాంబాబు (టీడీపీ)
డివిజన్ 19: పీ అనంతకుమార్ (టీడీపీ)
డివిజన్ 20: lనాగ సత్యనారాయణ (టీడీపీ)
డివిజన్ 21: బుర్రా విజయకుమారి (వైసీపీ)
డివిజన్ 22: మల్లా కిశోర్ (వైసీపీ)
డివిజన్ 23: శ్రీదేవి (వైసీపీ)
డివిజన్ 24: ఉదయ్ కుమార్ (వైసీపీ)
డివిజన్ 25: కే సీత (టీడీపీ)
డివిజన్ 26: సంగాని నందం (టీడీపీ)
డివిజన్ 27: రాజాన మంగారత్నం (టీడీపీ)
డివిజన్ 28: సుంకర పావని (టీడీపీ)
డివిజన్ 29: వాసిరెడ్డి రాంబాబు (ఇండిపెండెంట్)
డివిజన్ 30: చంద్రకళ దీప్తి (వైసీపీ)
డివిజన్ 31: బంగారు సూర్యావతి (టీడీపీ)
డివిజన్ 32: ఆర్ సత్యనారాయణ (వైసీపీ)
డివిజన్ 33: గుజ్జు దుర్గ (టీడీపీ)
డివిజన్ 34: తహేరా ఖాతూన్ (టీడీపీ)
డివిజన్ 35: బీ రామకృష్ణ (ఇండిపెండెంట్)
డివిజన్ 36: లక్ష్మీ ప్రసన్న (బీజేపీ)
డివిజన్ 37: లంకె హేమలత (టీడీపీ)
డివిజన్ 38: ఎం శేషుకుమారి (టీడీపీ)
డివిజన్ 39: మల్లిపూడి నాగదీపిక (ఇండిపెండెంట్)
డివిజన్ 40: శివప్రసన్న (టీడీపీ)
డివిజన్ 41: సత్యవతి (బీజేపీ)
డివిజన్ 42: ఎన్నికలు జరగలేదు
డివిజన్ 43: పవన్ కుమార్ (టీడీపీ)
డివిజన్ 44: ఇదిమిశెట్టి వెంకటరమణ (టీడీపీ)
డివిజన్ 45: కర్రి శైలజ (టీడీపీ)
డివిజన్ 46: కోరిమిల్లి బాలప్రసాద్ (టీడీపీ)
డివిజన్ 47: వెంకటలక్ష్మి (వైసీపీ)
డివిజన్ 48: ఎన్నికలు జరగలేదు
డివిజన్ 49: పి.ఉషారాణి (టీడీపీ)
డివిజన్ 50: పి. వెంకటత్రిమూర్తులు (టీడీపీ)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kakinada Muncipal Corporation Elections  TDP  YSRCP  

Other Articles