భార్యను చంపి 72 ముక్కలు.. డీప్ ఫ్రిజ్ లో దాచాడు. చివరకు ఎలాంటి శిక్షంటే... | Chopping wife, hiding body in deep freeze

Sadist husband gets life in dehradun

Delhi Techie Kill Wife, Wife Kill 72 Pieces, Dehradun, Rajesh Gulati Anupama Gulati, Husband Kills Wife Fridge

Delhi techie gets life term for chopping wife into 72 pieces. A local court in Dehradun on Thursday found software engineer Rajesh Gulati guilty of murdering his wife Anupama Gulati.

శాడిస్ట్ భర్తకు ఎలాంటి శిక్ష అంటే...

Posted: 09/01/2017 07:06 PM IST
Sadist husband gets life in dehradun

సుమారు ఏడేళ్ల క్రితం.. ఢిల్లీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో దోషికి ఈ రోజు శిక్ష ఖరారు అయ్యింది. డెహ్రూడూన్ లో తన భార్యను హతమార్చిన ‘టెక్కీ’ భర్తకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఉత్తరాఖండ్ కోర్టు తీర్పు నిచ్చింది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రాజేష్ గులాటి (38), తన భార్య అనుపమ (36)ను 2010, అక్టోబర్ 17వ తేదీ రాత్రి హతమార్చాడు.

2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేశ్, తన భార్య అనుపమ (36)తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన రాజేశ్, ఆమెను హత్య చేశాడు. కాగా, 1999లో వివాహం చేసుకున్న రాజేశ్-అనుపమ, ఆ తర్వాత అమెరికా వెళ్లారు. 2008లో తిరిగి డెహ్రాడూన్ వచ్చారు. తిరిగొచ్చాక కోల్ కతాకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాజేశ్ ను అనుపమ నిలదీస్తుండేది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరిగాయి.

ఈ క్రమంలో ఓ రోజు భార్యను హత్య చేసి ఆపై 72 ముక్కలుగా చేసి వాటిని పాలిథిన్ కవర్లలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వాటిని బయట పడేశాడు. 2010, డిసెంబర్ 12వ తేదీన అనుపమ సోదరుడు ఎస్ కె మహంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో రాజేశ్ ఇంట్లో సోదాలు చేయడంతో అసలు విషయం బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dehradun  Husband  Chop 72 Pieces  

Other Articles