ISRO readies replacement satellite after clock failure పీఎస్ఎల్వీ-సి39 లాంచ్ కు కౌంట్ డౌన్ బిగిన్స్..

Pslv c39 carrying irnss 1h series satellite to be launched on aug 31

isro, isro new satellite, navigation satellite, irnss-1h, clock failure, indian space research organisation, irnss, navic, technology

PSLV-C39 carrying 1425 Kg IRNSS-1H series satellite for navigation related applications to be launched from Andhra Pradesh's Sriharikota on August 31.

పీఎస్ఎల్వీ-సి39 లాంచ్ కు కౌంట్ డౌన్ బిగిన్స్..

Posted: 08/30/2017 02:34 PM IST
Pslv c39 carrying irnss 1h series satellite to be launched on aug 31

పీఎస్‌ఎల్వీ-సీ39 రోదసియానానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. సరిగ్గా గురువారం సాయంత్రం 7 గంటలకు నిందిలోకి పీఎస్‌ఎల్వీ-సీ39 దూసుకెళ్లనుంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో శాస్త్రవేత్తలు అంతా సిద్దం చేశారు. షార్ లోని బ్రహ్మప్రకాష్ హాలులో క్రితం రోజు మధ్యాహ్నం నుంచి రాకెట్ సన్నధంత సమావేశం సీనియర్ శాస్త్రవేత్త అలెక్స్ ఆద్వర్యంలో జరిగిన తరువాత రాకెట్ ను నింగిలోకి పంపేందుకు అనుమతలు లభించినట్టు తెలసింది.

సార్ లోని రెండో ప్రయోగవేదికపై 1,425 కిలోల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌తో సిద్ధంగా ఉన్న రాకెట్‌ ప్రయోగానికి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. షార్‌లో మంగళవారం జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలో శాస్త్రవేత్తలు రాకెట్‌ రిహార్సల్స్‌ ఫలితాలను పరిశీలించారు. రాకెట్‌ ప్రయోగానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అనంతరం షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ అధ్యక్షతన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధితను వ్యక్తం చేసింది. దీంతో ఈ ప్రయోగం కోసం ఇవాళ మధ్యాహ్నం 1.59 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.

గురువారం రాత్రి 7 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ39 రాకెట్‌ ద్వారా 1,425 కిలోల నావిగేషన్‌ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1హెచ్‌ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ కోసం గతంలో ప్రయోగించిన 7 ఉపగ్రహాల్లో తొలి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏలో కాలసూచిక వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్‌ను ప్రవేశపెడుతున్నారు. కాగా, ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్‌ ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ బుధవారం షార్‌కు చేరుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles