Teen DANCES to MACARENA.. Gets arrested in Saudi Arabia వైరల్: జెడ్డాలో పిల్లాడి డాన్సు అదిరింది.. సౌదీలో అరెస్టయ్యాడు..

Teen dances to macarena gets arrested in saudi arabia

macarena, teen arrested for dancing on saudi arabia street, teen dancing macarena, teen macarena saudi arrested, teen boy, arrest, dancing on road, saudi arabia, teen dancing, macarena song

The video of a 14-year-old boy dancing to the 1990s’ popular song Macarena at a street crossing in Jeddah, Saudi Arabia, has gone viral.

ITEMVIDEOS: వైరల్: జెడ్డాలో పిల్లాడి డాన్సు అదిరింది.. సౌదీలో అరెస్టయ్యాడు..

Posted: 08/23/2017 04:34 PM IST
Teen dances to macarena gets arrested in saudi arabia

మనస్సుకు నచ్చిన పాట వస్తే మనకు తెలియకుండానే మన పాదం కదులుతుంది. ఇక మరీ చిన్నపిల్లలయితే వారేం చేస్తున్నారో కూడా మర్చిపోతుంటారు. అలాగే జరిగిందో.. లేక తన డాన్సుకు వచ్చిన లైకుల సంఖ్య పెంచుకునే పనిలో భాగంగా చేశాడో తెలియదు కానీ ఓ పద్నాలుగేళ్ల బాలుడు ఏకంగా సౌదీ అరేబియాలో కఠినమైన నిబంధనలు వుంటాయని తెలిసో, తెలియకో జెడ్డా నగరంలోని ప్రధాన కూడలి వద్ద నడిరోడ్డుపై పాత హిట్‌ సాంగ్‌కు జోష్‌ తో కూడిన డ్యాన్స్‌ చేశాడు.

అయితే ఈ డాన్సు వీడియోను కెమెరాలలో బంధించిన యువకుడి స్నేహితులు దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, అనుకున్న దానికంటే అదికంగా అది వైరల్ అయ్యింది. ఇక తాజాగా మరో వార్త కూడా వెలుగులోకి రావడంతో మరింత వైరల్ గా వీడియో మారింది. ఇలా డాన్సు చేసినందుకు గాను ఆ బాలుడు సౌదీ పోలీసులకు అడ్డంగా బుక్ చేశారు. కఠిన నిబంధనలు పాటించే సౌదీలో రోడ్డు భద్రతా ప్రమాణాలను అతిక్రమించి డాన్సు చేసినందుకు గాను కుర్రాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

1990 నాటి మకారీనా పాటకు ఈ బాలుడు చిందులు వేశాడు. ఈ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో కూడా షేరుచేశాడు. పేరు, ఊరు తెలియని ఈ బాలుడి డ్యాన్స్‌తో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని మెక్కా పోలీసులు చెప్పారు. అంతేకాక పబ్లిక్ గా అతను సరిగ్గా ప్రవర్తించలేదని తెలిపారు. దీంతో బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని వెతికే పనిలో వున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న కార్లకు ఎదురుగా వచ్చిన మకారీనా పాట మొదటి ఐదు లైన్స్‌కు బ్యాన్స్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : macarena  teen boy  arrest  dancing on road  saudi arabia  teen dancing  macarena song  

Other Articles