Suresh Prabhu offers to resign over UP train accidents సురేష్ ప్రభు రాజీనామా... వాళ్ల డిమాండ్లకు సై. ప్రధాని నై..

Suresh prabhu offers to resign as railways minister pm narendra modi asks him to wait

suresh prabhu, suresh prabhu resigns, suresh prabhu resignation, suresh prabhu quits, narendra modi, minister of railways india, AK Mittal, train accident, railway ministry, kaifiyat express, kalinga utkal express, railway news

Railway Minister Suresh Prabhu has offered to quit after back-to-back train derailments in the last four days. Suresh Prabhu wrote on Twitter that he takes full moral responsibility for the accidents and has met Prime Minister Narendra Modi in this regard.

రాజీనామాకు సురేష్ ప్రభు సై... ప్రధాని నై..

Posted: 08/23/2017 03:43 PM IST
Suresh prabhu offers to resign as railways minister pm narendra modi asks him to wait

రైలు ప్రమాదాలను తాను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నానంటూ కేంద్రమంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్దపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంలో ఈ ప్రమాదంలో 23 మృత్యువాత పడ్డగా, 156 మంది గాయాలపాలయ్యారు. అయితే నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్రమాదాలు జరగడంతో విపక్షాలు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురష్ ప్రభు ను తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశాయి.

ఈ ప్రమాద ఘటనలకు తాను నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కేంద్రమంత్రి సురేష్ ప్రభు రెడీ అయ్యారు. ఇవాళ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలసి తాను రాజీనామా చేయాలని భావిస్తున్నానని కూడా చెప్పారని తెలుస్తుంది. ఈ మేరకు మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా రాజీనామాకు సిద్దపడ్డ సురేష్ ప్రభు తన రాజీనామా లేఖతో ప్రధాని వద్దకు వెళ్లి.. దానిని సమర్పించారని సమాచారం. ఈ క్రమంలో సురేష్ ప్రభు రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ బాటను ఫాలో అయ్యారని తెలుస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో గత నాలుగు రోజుల కిందట ప్రమాదానికి గురైన ఉత్కల్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఖైఫియత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదాలకు తాను నైతిక బాధ్యత వహించి రైల్వే బోర్డు చైర్మన్ ఏకూ మిట్టల్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ప్రమాదాలు సంబవించడం దురదృష్టకరమని భావించిన ఆయన ఇవాళ ఉదయం కేంద్ర రైల్వేశాఖ మంత్రికి తన రాజీనామాను సమర్పించారని జాతీయ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అయితే మిట్టల్ రాజీనామాను ఇంకా ఆమోదించని కేంద్రమంత్రి సురేష్ ప్రభు.. తన రాజీనామాను ప్రధానికి సమర్పించేందుకు వెళ్లారు.

ఆ తరువాత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు రైళ్లు పట్టాలను తప్పడం దురదృష్టకరమని ఆయన అవేధన వ్యక్తం చేశారు. అయితే గత మూడేళ్లుగా తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో రైల్వేశాఖ అభివృద్ది కోసం తన శాయశక్తులా ప్రయత్నించానని చెప్పారు. ఈ రెండు రైళ్ల ప్రమాదాలకు తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని పేర్కోన్నారు.  కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను వేచి చూడాల్సిందిగా కోరారని సురేష్ ప్రభు సోషల్ మీడియా ద్వారా చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles