Intelligence Bureau to recruit 1430 Intelligence Officer Posts ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలహో.. అర్హతలివే..

Intelligence bureau to recruit 1430 intelligence officer posts

intelligence bureau recruitment 2017, mha.nic.in, intelligence bureau recruitment, acio ii recruitment, mha jobs, government jobs, indian express, education news, intelligence officer recruitment, government jobs, jobs, central government jobs

The Ministry of Home Affairs (MHA) will open the application portal of the Intelligence Bureau today for the recruitment of 1430 assistant central intelligence officer (grade II/executive).

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలహో.. అర్హతలివే..

Posted: 08/14/2017 01:25 PM IST
Intelligence bureau to recruit 1430 intelligence officer posts

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు శుభవార్తనందించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అపైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలను భర్తి చేయనుందని తెలిపింది. ప్రపంచంలో అత్యంత పురాతన గూఢచార సంస్థగా ప్రసిద్ధి చెందిన ఐబీలో మొత్తం 1430 గ్రేడ్2 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను వెలువరించింది. భారత దేశంలోని అంతర్గత నిఘా సంస్థగా ఇంటెలిజెన్స్ బ్యూరో దేశంలోని అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుంది.

వివరాలు:
పోస్టు పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-2)
మొత్తం పోస్టులు: 1430

అర్హతలు:
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
వయస్సు: 2017 సెప్టెంబర్ 2 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితి సడలింపు
వెనకబడిన అభ్యర్థులకు మూడేండ్లు పరమితి సడలింపు
డిపార్టుమెంటల్ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయో పరిమితిలో సడలింపు

పే స్కేల్:
రూ.9,300-34,800+గ్రేడ్ పే రూ. 4,600. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులుంటాయి.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, OBC అభ్యర్థులు)
SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

ఎంపిక:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ
-రాతపరీక్ష టైర్-1(ఆబ్జెక్టివ్ ), టైర్-2 (డిస్క్రిప్టివ్) విధానంలో ఉంది.
-కేవలం రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారుచేసి, ఇంటర్వ్యూకు అనుమతిస్తారు.

దరఖాస్తు:
కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే పంపించాలి.
అభ్యర్థులు వినియోగంలో ఉన్న ఈ- మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ను మాత్రమే ఎంటర్ చేయాలి.
నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 2
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.mha.nic.in సంప్రదించగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IB recruitment  jobs at IB  ACIO recruitment  government jobs  jobs  central government jobs  

Other Articles