mother supports molester, forces minor daughter into prostitution కన్నతల్లేనా.. రొంపిలోకి దిగమని బలవంతం..

Mother supports molester forces minor daughter into prostitution

prostitution, minor girl, mother, srinivas, ghatkesar, sexual harassment, molestation, telangana police, crime

A mother from ghatkesar supports molester, and forces minor daughter to get into touch with him for sake of money, and encourages prostitution

కన్నతల్లేనా.. రొంపిలోకి దిగమని బలవంతం..

Posted: 08/14/2017 12:54 PM IST
Mother supports molester forces minor daughter into prostitution

పాము తన పిల్లలను తానే కబళించినట్లు.. ఓ కసాయి తల్లి కేవలం డబ్బుల కోసం తన యుక్త వయస్సు బిడ్డను వ్యభిచారం రోంపిలోకి దింపాలని బలవంత పెట్టిన ఘటన ఘట్ కేసర్ లో వెలుగు చూసింది. తన పిల్లలపై బంధువుల చూపు పడినా.. సహించకుండా వారిని అక్కడి నుంచి పంపేసి కామాంధుల కనుచూపులు పడకుండా కాపాడుకునే మాతృమూర్తులు వున్న సమాజం.. ఇలాంటి కసాయి తల్లులు కూడా అక్కడక్కడా వుంటారన్న విషయం తెలిసిందే.

అయితే తమ ఇంటికి వచ్చే ఓ వ్యక్తి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా.. ఆ తల్లికి కోపం రాలేదు. పైగా డబ్బులిస్తాడని కూతురికే సముదాయించడం దారుణం. అతడికి సహకరించాలని చెప్పింది. సభ్య సమాజంలో ఏ తల్లి ఇంతటి నీచంగా వ్యవహరించదు. తల్లి పదానికే పరాకాష్టగా నిలిచిన ఈ కసాయి.. కూతుర్ని వ్యభిచారం రొంపిలోకి దింపి డబ్బు సంపాదించాలని భావిస్తుంది. దీంతో తన తల్లితో పాటు తనపై అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిపై మైనర్ బాలిక పోలీసులకు పిర్యాుద చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఘట్ కేసర్ పరిధిలోని ఎన్‌ఎఫ్సీనగర్ కు చెందిన మైనర్ బాలిక(17)పై స్థానికంగానే నివాసముండే శ్రీనివాస్ కన్నెశాడు. అమెను లొబర్చుకునేందుకు తరుచుగా వారింటికి కూడా వెళ్లేవాడు. అయితే బాధితురాలితో తరచూ కలుస్తున్న క్రమంలో అమెతో పరిచయంతో బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న విషయాన్ని బాధితురాలు తల్లికి తెలిపింది.

తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడా..? అంటూ శ్రీనివాస్ పై అగ్రహంతో ఊగిపోవాల్సిన కన్నతల్లి.. అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. శ్రీనివాస్ ఏం చెప్పినా.. చేయాలి.. అతనికి పూర్తిగా సహకరించాలని.. అప్పుడే అతడు డబ్బులిస్తాడని, తన కూతుర్ని బలవంతం పెట్టింది. తన కన్న తల్లే ఇలా స్పందించడంతో బాధితురాలు ఇటీవల అత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. అయినా ఇటు కన్న తల్లిలోనూ, అటు కామాంధుడు శ్రీనివాస్ లోనూ ఏ మాత్రం మార్పు కనిపించలేదు.  పైపెచ్చు శ్రీనివాస్ అగడాలు మరింత పెరిగాయి. దీంతో బాలిక పోలీసులను అశ్రయించి శ్రీనివాస్ పై కేసు పిర్యాదు చేయడంతో దర్యాపు కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  minor girl  mother  srinivas  ghatkesar  sexual harassment  molestation  telangana police  crime  

Other Articles