మానవత్వం పేరిట పతాంజలి దోపిడి | Former CEO shocking Allegations on Patanjali

Patanjali only for free service not salaries

Baba Ramdev, Baba Ramdev Patanjali, Baba Ramdev Cheat Employees, Baba Ramdev Cheating, Baba Ramdev SK Patra, Patanjali Ex CEO SK Patra, Baba Ramdev Not Paying Salaries, Baba Ramdev Cheat Employees, Patanjali Employees Salaries, Baba Ramdev Allegations, Patanjali Free Service Mankind, Patanjali Mankind Service, Patanjali No Salaries

Baba Ramdev wants employees to work for free former CEO SK Patra reveals. Service of mankind slogan for Company and not paying salaries to employees.

పతాంజలిపై సంచలన ఆరోపణలు

Posted: 08/05/2017 09:46 AM IST
Patanjali only for free service not salaries

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద మాజీ సీఈవో ఎస్‌కే పత్ర రాందేవ్ పై తారాస్థాయిలో విమర్శలు చేశాడు. సేవ పేరుతో ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తారంటూ పత్ర విరుచుకుపడ్డాడు.

రూ.10,500 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్న పతంజలి కంపెనీలో ఉద్యోగులకు వేతనం అందడం లేదని, సేవ పేరుతో వారితో ఫ్రీగా పని చేయించుకుంటున్నాడని అంటున్నాడు పత్ర. అంతేకాదు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నాడు. పైగా దానికి బాబాజీ (బాబా రాందేవ్) సేవగా పిలుస్తున్నారని వివరించారు. తాను సీఈవోగా ఉన్నప్పుడు పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్‌పార్క్‌లో ఒకేసారి రెండు విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. రెండు ఉద్యోగాలకు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అలా జరగలేదన్నారు.

పతంజలి సేవ కోసమే పుట్టిందని, ప్రస్తుతం ఆయన వేతనం తీసుకుంటున్నా, తర్వాత అది ఉండదని చాలా ఓపెన్ గానే తనతో నిర్వాహకులు చెప్పేవాళ్లని తెలిపాడు. మరోవైపు పతంజలి ఉన్నది మానవ ‘సేవ’కోసమని అధికారిక వెబ్ సైట్ లో ఉన్న మాట పాత్ర వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. తనకు వేతనం ఆపడంపై పాత్రా పలుమార్లు బాబా రాందేవ్‌తో వాదనకు కూడా దిగారు. ‘‘నాకు వేతనం కావాలి. నా కోసం కాదు. నాకో కుటుంబం ఉంది. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకోసమైనా నాకు జీతం కావాలి’’ అని చాలాసార్లు బాబాను కలిసి వేడుకున్నట్టు చెప్పారు. దీంతో ముందు హామీ ఇచ్చినట్టు కాకుండా ఒక ఉద్యోగానికి మాత్రమే వేతనం ఇచ్చి, ఫ్రీ గా సేవలు చేయాలంటూ ఆదేశించారని వాపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramadev  Patanjali  Free Service  

Other Articles