అచ్చం ‘అతడు’ మూవీ డ్రామానే! గన్ తో విక్రమ్ దొరికిపోయాడు | Story Screenplay Dircetion by Vikram Goud

Vikram goud shooting case solved

Vikram Goud, Vikram Goud Case Mystrey, Vikram Goud Gun Fire, Vikram Goud, Vikram Goud Athadu Concept, Vikram Goud Mystery Solved, Vikram Goud Drama, Vikram Goud Firing Case Drama, Not Murder Suicide Attempt Vikram Goud Case, Vikram Goud Father, Vikram Goud Fake Story, Vikram Goud Case Gun, Vikram Goud Case Convicts

Congress Youth Leader Vikram Goud Firing Case Mystery Solved. Vikram wants to black mail father for money with friends help he creates shooting drama.

విక్రమ్ కాల్పుల కేసు: మిస్టరీ వీడింది

Posted: 08/01/2017 10:01 AM IST
Vikram goud shooting case solved

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. తన స్నేహితులతోనే తనపై దాడి చేయించుకున్నాడని నిర్ధారించుకున్నారు. రెండు రోజుల క్రితం తెల్లవారు జామున దుండగులు కాల్పులు జరిపారంటూ అపోలో ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ చేరిన సంగతి తెలిసిందే. అయితే హత్యాయత్నం జరిగిందని బాధితులు చెబుతున్నప్పటికీ ఆత్మహత్యాయత్నంగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విక్రమ్ గౌడ్ భార్య షిపాలి, విక్రమ్ సమాధానాలకు పొంతన లేకపోవటంతో ఆ అనుమానాలు బలపడ్డాయి.

అనంతరం విక్రమ్ గౌడ్ వాంగ్మూలం తీసుకుని, వారిద్దరూ చెప్పినదానికి పొంతన కుదరడం లేదని గుర్తించారు. అలాగే విక్రమ్ గౌడ్ తనపై బయటి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో బయటి నుంచి కాల్పులు జరిపితే అతని భుజంపై బుల్లెట్ దిగే అవకాశం లేదని గుర్తించి నిర్ధారించుకున్నారు. అలాగే బయటి నుంచి తుపాకీ కాల్పులు జరిపితే తుపాకీ తూటా తలుపు బయటివైపు నుంచి దూసుకెళ్లాల్సి ఉంటుందని, కానీ తూటా తలుపు లోపలివైపు నుంచి వెళ్లిందని పేర్కొన్నారు.

దీంతో ఇది బయటి నుంచి జరిగిన కాల్పుల వ్యవహారం కాదని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత షిపాలి మాత్రమే తనను ఆసుపత్రికి తీసుకెళ్లిందని చెప్పిన పోలీసులకు కారులోంచి నలుగురు వ్యక్తులు దిగి విక్రమ్ గౌడ్ ను అపోలో ఆసుపత్రిలో చేర్చిన పుటేజ్ ను సేకరించారు. అనంతరం వారెవరని ఆరాతీశారు. అలాగే విక్రమ్ గౌడ్ కాల్ లిస్ట్, వాట్స్ యాప్ మెసేజ్ లు, ఇతర వివరాలు పరిశీలించిన పోలీసులు ఇందులో వాడిన ఆయుధం ప్రధానాంశంగా దర్యాప్తు చేశారు.

ఎట్టకేలకు విక్రమ్ గౌడ్ టెలిఫోన్ సంభాషణలు, మెసేజ్ లు, వాట్స్ యాప్ సంభాషణల ద్వారా నిందితులను అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫైరింగ్ డ్రామా ఆడి తండ్రి నుంచి డబ్బులు గుంజాలని, ఫైనాన్సియర్ల దగ్గర డబ్బు ఎగ్గొట్టాలని యత్నించినట్లు స్పష్టత వస్తోంది. బయటే కాల్పులు జరిపించేందుకు ఫ్లాన్ వేసినప్పటికీ దొరికిపోతామనే ఉద్దేశ్యంతో ఇంట్లో నే సీన్ క్రియేట్ చేశాడని అర్థమౌతోంది. విక్రమ్ ఫ్రెండ్స్ రాజు, రాజశేఖర్, మురళి ను తమ శైలిలో విచారిస్తున్న పోలీసులు కాసేపట్లో దీనిపై పోలీసులు ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Goud  Firing Case  Fake Story  

Other Articles