వడగళ్ళు పడుతున్నా ఆమె విధి నిర్వహణ ఆపలేదు | Lady Reporter Continues Live Broadcast in Hail Storm

Reporter struggles to report during hail storm

New Reporter, Live Reporter in Storm, Turkish Lady Reporter Storm, Reporting in Heavy Storm, A News Lady Reporter, Shannon Murray, Shannon Murray spider Video, Fox News Spider, Brave Lady Reporter, Heavy Rain Live Reporting,

A freak hail storm battered the Turkish city of Istanbul late last week but that didn't stop A News Lady Reporter from going on with her live broadcast.News reporter Shannon Murray shows off nerves of steel as spider crawls down her arm during cross.

ITEMVIDEOS:దెబ్బలు తగులుతున్నా.. డ్యూటీ ఆపలేదు

Posted: 08/01/2017 09:05 AM IST
Reporter struggles to report during hail storm

చేయాల్సిన పని, అవసరమైన మాటలు కాకుండా అడ్డమైన సొల్లు వాగుతూ పైగా గ్లామర్ టచప్ లు ఇస్తూ... లైవ్ రిపోర్టింగ్ లు ఇప్పిస్తున్నాయి కొన్ని ఛానెళ్లు. చెప్పిందే చెప్పటం.. తిప్పి, తిప్పి మడతేయటం.. ఇలా అతి వ్యవహారాలతో మన మీడియాలో ఇది మరీ కామన్ గా మారిపోయింది. కానీ, విధి నిర్వహణలో అంకితభావం అంటే ఎలా ఉండాలో ఇక్కడో విదేశీ రిపోర్టర్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

ఓ వైపు భారీ వర్షం, మరోవైపు పెద్ద పెద్ద వడగళ్లు నెత్తిపై పడుతున్నా తన కర్తవ్యం మాత్రం ఆపలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే... టర్కీలోని ఇస్తాంబుల్‌లో గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. స్థానిక న్యూస్ చానల్‌కు చెందిన మహిళా రిపోర్టర్ లైవ్ కవరేజీ కోసం వెళ్లింది. రెయిన్ కోట్ వేసుకుని రిపోర్టింగ్ ఇస్తోంది. అప్పటికే వర్షం పడుతోంది. మరోవైపు భారీ పరిమాణంలో ఉన్న వడగళ్లు కూడా పడుతున్నాయి. అవి నేరుగా నెత్తిని తాకుతున్నా ఆమె మాత్రం రిపోర్టింగ్ మానలేదు సరికదా, వాతావరణ పరిస్థితిని చక్కగా వివరించింది.

వడగళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆమె పడుతున్న ఇబ్బందులు గమనించిన స్టూడియోలోని యాంకర్ ఆమెను సురక్షిత ప్రాంతానికి వెళ్లమని సూచించాడు. అయినా తనకేం ఫర్వాలేదంటూ ఆమె పట్టించుకోకుండా రిపోర్టింగ్ చేస్తూనే ఉంది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆమెను చూసిన గొడుగు తెచ్చి పట్టాడు. ఈ వీడియోను న్యూస్ చానల్ సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. రిపోర్టర్ అంకితభావానికి శభాష్ అంటూ... ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


స్పైడర్ పాకినా పట్టించుకోలేదు...

ఇక్కడ మరో యాంకర్ వ్యవహారం చూద్దాం. ఫాక్స్ 4 న్యూస్ రీడర్ షాన్నన్ ముర్రే లైవ్ లో వార్తలు చదువుతుండగా, ఆమె భుజంపై కాస్త పెద్ద సైజులోనే సాలీడ్ పాకుతూనే ఉంది. కెమెరామెన్ కంటికి అది చిక్కటంతో దానిని కూడా వీడియో తీస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దాన్నేం పట్టించుకోకుండా న్యూస్ రీడర్ తన పని పూర్తి చేసి ప్రశంసలు పొందింది. అయితే ఆ సమయంలో తాను అసలు దానిని గమనించలేదని ముర్రే చెబుతోంది. ఆమె వార్తలు చదువుతున్న సమయంలో కొందరు ఆమె ట్విట్టర్, ఫేస్ బుక్ లో మీ మీద ఏదో పాకుతోంది.. యాక్... అంటూ పోస్టులు పెట్టడం విశేషం. వాటిని చూసిన తర్వాతే తాను విషయం తెలుసుకున్నానని ఆమె తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Turkey  Hail Storm  Lady Reporter  

Other Articles