SBI cuts interest rate on savings account deposits సామాన్యులకు మళ్లీ వాత పెట్టిన ఎస్బీఐ

Sbi cuts interest rate on savings account deposits

State Bank of India,SBI,MCLR,SBI interest rates,SBI interest rate on FD,SBI interest rates saving account, saving bank rate, RBI, rate cut, NSE, Nifty, arundhati bhattacharya

State Bank of India has cut interest rate on savings bank accounts to 3.5 per cent from 4 per cent on balance of Rs 1 crore and below.

సామాన్యులకు మళ్లీ వాత పెట్టిన ఎస్బీఐ

Posted: 07/31/2017 06:56 PM IST
Sbi cuts interest rate on savings account deposits

ప్రపంచ అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ అతిపెద్ద బ్యాంకుగా అవతారమెత్తిన తరువాత దానికి సంబంధించన ఫలాలను కస్టమర్లకు అందిస్తుందని ఆశించిన ఖాతాదారులకు మళ్లీ చేదు వార్తను అందించింది. బ్యాంకు వ్యవస్థలు లాభాపేక్ష లేకుండా నడవాలని వాటిని ఏర్పాటు చేసే క్రమంలో.. చివరకు జాతీయంగా మార్చే క్రమంలో అప్పటి నేతలు అలోచించడంతో పాటు అదే విషయాన్ని బ్యాంకులకు కూడా చెప్పారు. అయితే మారిన కాలక్రమంలో ప్రపంచీకరణ నేపథ్యంలో బ్యాంకులు కూడా లాభాపేక్షతోనే ముందుకు సాగుతున్నాయి.

లాభాల అన్వేషణకు మొగ్గుచూపడంలో తప్పులేదు కానీ ఖాతాదారుల మధ్య వడ్డీ విషయంలో వ్యతాసం తీసుకువస్తే అవి శుభసూచకం సామాన్యులకు ఒకలా.. సంపన్నులకు మరోలా వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోవడాన్ని సామాన్య ఖాతాదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సామాన్యులకు ఇచ్చే రుణాల విషయంలో ముక్కిపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు. సంపన్నులకు మాత్రం మినహాయింపులు కల్పించి వాటిని బ్యాడ్ డెట్స్ గా మారుస్తున్నారని విమర్శలు వస్తున్న క్రమంలో ఎన్బీఐ మరోమారు అలాంటి నిర్ణయమే తీసుకుని విమర్శలను ఎదుర్కొంటుంది.

తాజాగా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీలో కోత పెట్టింది. కోటి రూపాయల లోపు నగదు డిపాజిట్లపై ప్రస్తుతం ఇస్తున్న 4శాతం వడ్డీని.. 3.5శాతానికి తగ్గించింది. కోటి రూపాయలపైన డిపాజిట్లపై వడ్డీని యథాతథంగా ఉంచింది. ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు నగదు డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ రేటును కూడా తగ్గించారు. ప్రస్తుతం 6.90శాతం ఉన్న వడ్డీ.. ఇక నుంచి 6.75శాతంగా మార్పు చేసింది. దీంతో సామాన్యులకు వడ్డీని తగ్గించి సంపన్నులకు (రూ. కోటిపైన డిపాజిట్లపై) మాత్రం చెల్లించే వడ్డీలను మాత్రం యథాతథంగా కొనసాగించడం పట్ల ఖాతాదారుల విమర్శలను ఎదుర్కొంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sbi interest rates  RBI  SBI  MCLR  interest rates  State Bank of India  

Other Articles