Pawan Kalyan and AP CM meet at Velagapudi అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని..

Pawan kalyan and ap cm meet at velagapudi

Ap Chief Minister, chandrababu, pawan kalyan, Velagapudi, uddanam problem, kidney failures, harward university, jeevan dhan, brand ambassafor, Andra pradesh

Pawan Kalyan along with Harward Doctors met Andhra pradesh chief minister chandrababu to discuss on uddanam kidney problem

ITEMVIDEOS: అక్టోబర్ నుంచి ప్రజల్లోకి జనసేనాని పవన్ కల్యాన్

Posted: 07/31/2017 05:43 PM IST
Pawan kalyan and ap cm meet at velagapudi

ఉద్దానం సమస్య దశాబ్దాలుగా వుందని.. అయితే తాను కేవలం సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు మాత్రమే వేశానని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఈ సమస్యను మీడియా ద్వారా తెలుసుకన్నానని, దీంతో వారికి పరిష్కారం కల్పించే దిశగా తనవంతుగా తాను కృషి చేశానన్నారు. ఈ సమస్యపై రాజకీయం చేయాలనో, లేక రాజకీయ లబ్ది పోందాలనో తాను ప్రయత్నించలేదని అన్నారు. ఈ సమస్యను తాను మానవతాదృక్పతంతోనే చూశానని, బాధితుల సమస్యను పరిస్కారించాలనే తాను కృషి చేశానన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జనసేనాని పవన్ కల్యాన్ మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రిసర్చ్ సెంటర్ పెడితే కలసి పనిచేస్తామని చెప్పారు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు చనిపోవడంతో అనేక మంది చిన్నారులు అనాధలుగా మారిపోతున్నారని . దీంతో  సమస్యను పరిష్కరించే విధంగా తాము కృషి చేస్తున్నామని అన్నారు. దీంతో వ్యాధి తీవ్రత తెలిసే సరికి వారు అనారోగ్యం బారిన పడుతున్నారని అయన అవేధన వ్యక్తం చేశారు.

జనసేనది విధానపరమైన రాజకీయం... విభజించేది కాదు..

తాను ఉద్దానం పర్యటన తరువాత బాధితుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించిందని తెలిపారు. ప్రభుత్వం ఉద్దానం బాధితులకు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా బాధితులకు కొంత ఉపశమనం లభించిందని అన్నారు. అయితే రాజకీయ లబ్దిని అలోచించడం ద్వారా బాధితులకు న్యాయం జరగదు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని అన్నారు. బాధితులకు పరిష్కారం చూపించే విధానపరమైనదే తన రాజకీయమని పవన్ చెప్పారు.

మనుషులను జతపరిస్తూ సమాజాన్ని ఏకతాటిపై నడిపే రాజకీయం చేయడం చాలా కష్టమన్న ఆయన అలాంటి రాజకీయమే తనదని, ఎంత కష్టమైనా అలాంటి రాజకీయాన్నే తాను నడుపుతానని అన్నారు. విడగొట్టి రాజకీయ లబ్ది పోందడం చాలా సులభమని అయితే ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో మిగిలేవారు ఎవరూ వుండరని అన్నారు. తాను రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు. విభజన రాజకీయాలకు తాను దూరమని, అవి గత కొన్నాళ్లుగా ఈ రాజకీయాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని అన్నారు. జీఎస్టీపై చిన్నవ్యాపారులకు భారంగా మారుతున్నాయి.. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత జీఎస్టీని తగ్గించాలని కోరాం. అయితే ఇది కేంద్రం పరిధిలోని అంశమని కాబట్టి ఎలా స్పందిస్తారో వేచి చూడాలన్నారు.

అక్టోబర్ నుంచి ప్రజల్లోకి.. నంద్యాల ఉపపోరుపై త్వరలో నిర్ణయం

అక్టోబర్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ పార్టీ శ్రేణులకు తీపి కబరునందించారు పవన్. అక్టోబర్ నుంచి ఎక్కవ సమయం రాజకీయాలకు కేటాయిస్తానని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ శ్రేణుల ఎంపిక పూర్తయిందని అన్నారు. ఏపీలో రెండు జిల్లాలు ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. అది అక్టోబర్ కి పూర్తవుతుందని చెప్పారు. మరో రెండు మూడు నెల్లలో పార్టీ శిక్షణా తరగలు పూర్తవుతాయని ఆ తరువాత ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే అధిక సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు. తాను ముందుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకుంటానని చెప్పారు.

అయితే పాదయాత్ర చేసేందుకు తాను సిద్దమైనా.. శాంతిభద్రతల సమస్యల దృష్టా.. అలాంటి సమస్యలను కల్పించడం తనకు ఇష్టంలేదని అందువల్లే తాను పాదయాత్రలు చేయనని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వెలగపూడి రావడానికి తనకు పట్టిన సమయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే ప్రజాసమస్యలు తెలుసుకోవాడానికి పాదయాత్ర తప్పనిసరి కాదని, తాను గొదావరి అక్వాఫార్కు గురించి కానీ లేక ఉద్దానం కిడ్నీ సమస్య గురించి కానీ పాదయాత్ర చేసి తెలుసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నంద్యాల ఉప ఎన్నికలలో తాము ఎవరికి మద్దతు ఇస్తామన్న అంశాన్ని మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

గంగవర్రు ఘటనపై అందుకనే స్పందించలేదు..!

గంగవర్రు ఘటనపై తాను స్పందించలేదని కొన్ని వార్తలు వచ్చాయని, అయితే ఇది చాలా సున్నితమైన అంశమని పవన్ చెప్పారు. గరగపర్రులో రెండు సామాజికవర్గాల మధ్య విభేధాలు వచ్చాయని, ఇలాంటి అంశంపై తాను తప్పు.. ఒప్పు అని స్పందిండం సరికాదని, ఇలాంటి అంశాలపై తాను ఎలా స్పందించినా.. మరోలా చేసిందుకు చర్యలు జరిగిపోతాయని అన్నారు. ఇలాంటి ఘటనలపై తాను అప్పటికప్పడు స్పందించడం వల్ల మేలు జరగదన్నారు. కాగా, గరగపర్రులో జరిగిన వాస్తవం తాను తెలసుకున్నానని అన్నారు.

అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు లకు కులాలు అంటగట్టడం సమంజసం కాదని ఆయన సూచించారు. అడవి పుత్రులతో కలసి స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామారాజు చేసిన పోరాటం ఆయనను మన్యం వీరుడిగా గుర్తింపును తీసుకువచ్చిందని, అయితే ఆయన క్షత్రియుడని ఒక సామాజిక వర్గం వారు తమకు సోంతం చేసుకోవడం తప్పుని అయన అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా అన్ని సామాజిక వర్గాలవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా యావత్ జాతికి చెందిన మహాత్మగాంధీపై నేటితరం రాజకీయ నేతలు వేస్తున్న సెటర్లపై కూడా ఆయన మండిపడ్డారు.

కాపుల రిజర్వేషన్లపై అచితూచి మాట్లాడిన పవన్

కాపు రిజర్వేషన్ సమస్యపై తానెప్పుడూ మాట్లాడలేదని.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత దానిపై ఒక అవగాహన ఉందని అన్నారు. కాపు రిజర్వేషన్ సమస్య కొన్ని దశాబ్దాలుగా నడుస్తుందని. అయితే దీనికి పరిష్కరం దిశగా సాగుతున్న క్రమంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు నాన్చిందో తనకు తెలియదని అన్నారు. అలాగే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పని బీసి సంఘాలు.... దానిని అమలు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయో వారికే తెలియాలని అన్నారు.

గత ఎన్నికలలో తాను ఆర్ కృష్ణయ్య తరపున కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని, అప్పట్లో ఆయన కూడా అభ్యంతరం చెప్పినట్టు తనకు గుర్తులేదని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం అభ్యంతరాలను లేవనెత్తడం సరికాదన్నారు. కాపు రిజర్వేషన్ సమస్యను వివాద రహితంగా పరిష్కరించాలని ఆయన చెప్పారు. ఎవరైనా నేతలు రెచ్చగొడితే దాని వల్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయో తప్ప సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇలాంటి వాటికి ఎవరూ సహకరించవద్దని అన్నారు. అలాగే బిసి సంఘాల నేతలు కూడా మనస్పూర్తిగా తమ వాదనలను మంజునాథ కమీషన్ ఎదుట వినిపించాలని ఆయన చెప్పారు.  

pawan-uddanam

ప్రభుత్వాలు తప్పులు చేస్తే ప్రశ్నిస్తా.. ఎవరితో రహస్య ఎజెండాలు లేవు

టీడీపీకి తాను రహస్య ఎజెండాను ఏర్చుకున్నానన్న వార్తలను పవన్ ఖండించారు. గత సార్వత్రిక ఎన్నికలలో తాను టీడీపీకి, బీజేపికి ప్రత్యక్షంగా, బహిరంగంగా మద్దతునిచ్చానని, అయితే తమ మధ్య రహస్య ఎజెండా వుందనడం సరకాదని అన్నిరు. అయితే ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎప్పుడైనా ప్రశ్నింస్తానని.. తాను గతంలో చేప్పిన మాటపై తాను నిలబడతానని అన్నారు. అయితే సమస్యలను పరిష్కారం దిశగా ప్రయత్నించకుండా కేవలం రాజకీయం చేయడమే తన ఎజెండా కాదని చెప్పారు.

అయితే ప్రజలు ఒకటి గుర్తించాలని పవన్ చెప్పారు. అభిప్రాయాలు కుదరక బంధుత్వాన్నే కాదనుకున్న వాడినని, అలాంటిది ఈ స్నేహాలు ఎంత? అని ఆయన ప్రశ్నించారు. తనకు ప్రజలు, ప్రజా సమస్యలే ముఖ్యమని ఆయన చెప్పారు. ఆ తరువాతే ఎలాంటి బంధాలైనా అన్నారు. పార్టీ ఫిరాయింపులు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న రీతిలో తయారయ్యాయని ఆయన చెప్పారు. ఒకప్పుడు విలువలు కలిగిన రాజకీయాలు ఉండేవని, కానీ ఇప్పుడు ప్రాంతీయస్తాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అవినీతి రాజకీయాలకు అలవాలంగా మారాయని ఆయన దుయ్యబట్టారు. గోదావరి అక్వాపుడ్ ప్రాజెక్టు విషయంలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను.. ఇంకా ప్రశ్నిస్తునే వున్నానన్నారు. అక్వాఫుడ్ ప్రాజెక్టు నిజంగా కాలుష్య నియంత్రణ మండలి నిబంధలనుసారంగా నిర్మించిందేనా అని పవన్ ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కార్యచరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాన్ని తమ జనసేన పార్టీ వదిలేయలేదని పవన్ కల్యాన్ చెప్పారు. అయితే ఈ అంశాన్ని కావాలనే పలు రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై తన పోరాటం ముగియలేదని.. అయితే ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా..? జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకుళ్లేందుకు తాము యోచిస్తున్నామని, అందుకని ఓ కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యచరణ పూర్తైన తరువాత ఈ అంశమై తమ పార్టీ నేతృత్వంలో ఉద్యమించేందుకు తాము సిద్దమని చెప్పారు.

ప్రత్యేకహోదా వస్తుందా? రాదా? అన్న అంశం కన్నా.. అసలు రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అవసముందా లేదా..? అన్నది చర్చించాల్సిన అవసమని, ఇందుకోసం మనవంతుగా మనం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చామా లేదా..? అన్నది కూడా ముఖ్యమేనని అన్నారు. పునర్విభజన పేరుతో ఏపీని అన్యాయంగా విభజించినప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. దానిపై పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. అలాగే పశువు కోసం మనిషిని చంపడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పును తప్పు అని ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే ఎదిరించేందుకు తాను సిద్ధమని ఆయన అన్నారు. రెండు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికలపై స్పందిస్తానని ఆయన అన్నారు.  

‘జీవన్ ధాన్’కు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్..?

చంద్రబాబుతో గంట పాటు సమావేశమైన పవన్‌ కల్యాన్ ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా.. పలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఉద్దానం బాధితుల అంశంపై పవన్ చొరవ తీసుకోవడం తనకు సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న జీవన్ ధాన్ కార్యక్రమానికి... బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరినట్టు తెలిసింది. దానికి పవన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఎంతో మంది కిడ్నీ బాధితుల సమస్యను తనదిగా భావించి సమస్య పరిష్కారానికి హార్వార్డ్ వైద్య బృందాన్ని సైతం రప్పించిన పవన్ జీవన్ దాన్ కార్యక్రమానికి సరైన అంబాసిడర్ గా చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles