Heroine Husband Gets Death Threats For Marrying 'Hindu Girl' హీరోయిన్ భర్తకు బెదిరింపు కాల్స్..

Bollywood heroine husband gets death threats for marrying hindu girl

ayesha takia, farhan azmi, Death Threats, life threat calls, babu azmi, love jihad, bomb threat, rajasthan hindu sena, suchitra krishnamurthy, bollywood actress, masjid namaz, bollywood, celebrities, movies, news, entertainment, crime

Ayesha Takia's husband Farhan Azmi filed a complaint with the Mumbai Police on July 26 for having received death threats from a political outfit over a phone call earlier this month

హీరోయిన్ భర్తకు బెదిరింపు కాల్స్..

Posted: 07/29/2017 02:10 PM IST
Bollywood heroine husband gets death threats for marrying hindu girl

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన  ‘సూపర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అయేషా టకియా గుర్తుందా..? అమె భర్త ఫర్హాన్‌ అజ్మీకి బెదిరింపు కాల్స్‌ రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో ఎనమిదేళ్ల కింద వివాహం జరిగింది. వారి అన్యోన్య జీవితానికి ఐదేళ్ల కుమారుడు కూడా వున్నాడు. అయితే హిందూ అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకున్నావ్..? అంటూ అయేషా భర్తకు తాజాగా బెదరింపు కాల్స్ రావడం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోన్ కాల్స్ చేసింది హిందుత్వ పార్టీ నుంచి అని సమాచారం.

వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫర్హాన్‌ ముంబయిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్‌ హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన అయేషా టకియా.. 2009లో సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీను వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన వివాహం గురించి బెదిరింపు కాల్స్‌ రావడం కలకలం రేగుతుంది. తమ ఇంటి ముందు, ఆఫీస్‌లో, కార్లలో బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫర్హాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజస్థాన్‌ హిందూ సేన నుంచి ఈ కాల్స్‌ వచ్చిందని పోలీసులకు పిర్యాుద చేశాడు. అంతేకాదు అతని నాన్న బాబు అజ్మీని కూడా చంపుతామని.. ఊరికే నోరుపారేసుకోవద్దని హెచ్చరించినట్లు పిర్యాదు చేశాడు. లేకపోతే ఆయన్ని లేపేస్తాం. మీరంతా జంతువులు లవ్ జీహాద్ పేరిట మీరు హిందువు యువతని పెళ్లి చేసుకున్నావు కదా.. అనుభవిస్తావ్..? అయినా ఓ ముస్లిం అయివుండి హిందూ యువతిని అందులోనూ బాలీవుడ్‌ నటిని పెళ్లిచేసుకుంటావా? నీ అంతుచూస్తాం’ అని బెదిరించినట్లు పర్హన్ తన పిర్యాదుల పేర్కోన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ayesha takia  farhan azmi  Death Threats calls  love jihad  rajasthan hindu sena  bollywood  crime  

Other Articles