No automatic arrest in 498a, says SC 498-ఎ కేసుల్లో వెంటనే అరెస్టులు ఉండవట

No arrest in dowry cases till charges are verified says supreme court

Dowry, Supreme Court of India, Supreme Court, concern over disgruntled wives, dowry harassment, wives misusing the anti-dowry law, anti-dowry law, National Crime Records Bureau, harassment, FWC, crime

Supreme Court directed that no arrest or coercive action should be taken on such complaints without ascertaining the veracity of allegations.

498-ఎ కేసుల్లో వెంటనే అరెస్టులు ఉండవట

Posted: 07/29/2017 12:46 PM IST
No arrest in dowry cases till charges are verified says supreme court

వరకట్న కేసులలో ఇకపై వెంటనే అరెస్టులు చేయరాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. 498-ఎ కేసులను నమోదు చేస్తున్న వారిని.. పిర్యాదును ఎదుర్కొంటున్న వారిని విచారించిన తరువాత  అరెస్టులు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం అదేశాలు తెలిపింది. వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విచారణ చేయకుండా, ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోకుండా అరెస్టు చేయడం తగదంటుంది సుప్రీంకోర్టు. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొందరు భార్యలు భర్తలను సాధిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది.

ఫలితంగా కొంతమంది అమాయక భర్తల హక్కులను హరిస్తున్నట్లు అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇకపై ఈ కేసుల పిర్యాదులపై ముందుగా నిజనిర్థారణ చేసుకోవాలని ఆ తరువాతే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని సూచించింది. దీంతో భార్యభర్తల మధ్య వరకట్నం కేసులో రేగిన వివాదం పరిష్కారం అయ్యేందుకు మార్గాలు వుంటాయని, లేని పక్షంలో ఆ మార్గాలు మూసుకుపోయే ప్రమాదం ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇకపై ఈ చట్టం కింద దాఖలయ్యే పిర్యాదులను పరిష్కరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలు, సూచనలను జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం జారీ చేసింది.

వరకట్న కేసుల విచారణకు ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలు.
‘498–ఏ కింద వచ్చిన ప్రతి ఫిర్యాదులను పోలీసులు కమిటీలకే పంపాలి.
ఫిర్యాదు అందిప పుల నెలరోజుల లోపు కమిటీలు పోలీసులకు నివేదిక అందజేయాలి.
నివేదికలోని అంశాలను బట్టే పోలీసులు అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలి.
మహిళలపై బౌతికగాయాలు వున్నప్పుడు ఈ మార్గదర్శకాలు వర్తించవు
ఇలాంటి కేసులను ఉన్నాత పోలీసు అధికారులు మాత్రమే విచారించాలి.

ఒకవేళ ఫిర్యాదులో పేర్కొన్న నిందితుడు భారత్ కు వెలుపల నివసిస్తోంటే, అలాంటివారి పాస్ పోర్టులను నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయడం వంటి చర్యలకు దిగకూడదని పేర్కొంది కోర్టు. కుటుంబ సంక్షేమ కమిటీలను జిల్లా న్యాయసేవల అధికార సంస్థలు నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కమిటీల పని తీరును జిల్లా జడ్జి లేదా సెషన్స్‌ జడ్జి కనీసం ఏడాదికి ఒకసారైనా విధిగా సమీక్షించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles