సీఎంగా నితీశ్.. వెంటనే ఝలక్ | Nitish Kumar to return as Bihar CM Sixth Time

Nitish kumar to swear in as bihar cm

Nitish Kumar, Nitish Kumar Swear CM, Nitish Kumar Sushil Modi, Sushil Modi Deputy CM, Bihar New CM, Bihar New Deputy CM, Nitish BJP Alliance, Nitish Modi Bond, Nitish Kumar Bihar, Nitish CM Modi Deputy CM, Nitish Good Bye Grand Alliance, Nitish Lalu, Nitish Kumar Floor Test, Bihar Assembly Floor Test

JD(U) Leader Nitish Kumar To Form Govt In Bihar With Support Of BJP. Swear as CM for 6th time and BJP leader Sushil Kumar Modi as Deputy CM,

సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

Posted: 07/27/2017 10:22 AM IST
Nitish kumar to swear in as bihar cm

మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి దగ్గరుండి మరీ ఈ కార్యక్రమం నిర్వహించాడు. మరోపక్క బీజేపీ నేత సుశీల్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ వెంటనే శుక్రవారం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ నితీశ్ ను ఆదేశించాడు.

బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 122. ఆర్జేడికి 80, జెడియుకు 71, కాంగ్రెస్‌కు 27 స్థానాలుండగా...బిజెపికి 53 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలున్నాయి. అంటే బీజేపీ, జేడీయూ 124, ఇతరులతో కలుపుకుని మరో 5 మొత్తం 129 గా ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ బలం 107. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం జరిగే పరిణామాలే కీలకం కానున్నాయి.

అంతకుముందు తేజస్వి యాదవ్ గవర్నర్ త్రిపాఠిని కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అనుమతించాలని కోరగా, ఇప్పటికే సంఖ్యాబలాన్ని చూపినందున ఆయన్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించానని, అందువల్ల ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోలేనని త్రిపాఠి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, బల నిరూపణకు ఎక్కువ రోజులు గడువు ఇవ్వబోనని ఆయన చెప్పడంతో, ఇక చేసేదేమీ లేక తేజస్వి బయటకు వచ్చేశాడు.

నితీశ్ కు ఝలక్...

ప్రజలు ఓటేసిన మహా కూటమిని బద్దలు కొడుతూ, గతంలో తాను స్వయంగా తిరస్కరించిన బీజేపీ వైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు వేయడాన్ని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు అలీ అన్వర్ తీవ్రంగా విమర్శించారు. ఆయన అంతరాత్మ ఈ పని చేయమని చెప్పిందేమో కానీ, తన అంతరాత్మ మాత్రం ఇటువంటి నీచపు కార్యాన్ని ప్రోత్సహించడం లేదని నిప్పులు చెరిగారు. నితీశ్ రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశాడు. జనతాదళ్ (యు)కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం, ప్రజాభిప్రాయాన్ని కాదనడం తమకు ఇష్టం లేదని బహిరంగంగానే చెబుతుండటంతో, వారిని బుజ్జగించే యత్నాల్లో నితీశ్ ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Nitish Kumar  Sushil Kumar Modi  

Other Articles