500 లకు జియో4జీ ఫోన్.. ఆ కంపెనీనే ఇస్తుందా? | Reliance Jio 4G VoLTE Feature Phone Announcement

Jio ready for another offer

Jio 4G Feature, Jio Intex phone, 500 4G Phone, Jio 4G VoLTE, 4G Feature Phone, Intex Jio Phone, 4 D Cheapest Phone, Jio 4G Feature Phone

Jio 4G Feature Phone get Ready. Manufacturing Talks in 'Final Stages', Says Intex. Mukesh Ambani may announce on AGM July 21st.

రేపే మరో బంఫరాఫర్ ప్రకటన?

Posted: 07/20/2017 09:14 AM IST
Jio ready for another offer

ఊహించని రేంజ్ లో ఆఫర్లను ప్రకటిస్తూ సంచలనాలకు నెలవుగా మారిన రిలయన్స్ జియో మరోదానికి సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. కేవలం 500 రూపాయలకే 4జీ ఫీచర్ ఫోన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకున్నాం. అందుకు ఈనెల 21న జరగనున్న వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) వేదిక కానుందని వార్తలు వినిపించాయి. అనుకున్న ప్రకారం ఆ టైం రానే వచ్చింది. దీంతో ప్రత్యర్థి కంపెనీలకు కునుకు లేకుండా పోతుంది.

పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను టార్గెట్ చేస్తూ 1500 రూపాయిలుగా అనుకున్న ఫోన్ ధరను, తర్వాత కేవలం 500 గా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇంటెక్స్ కంపెనీతో ఓ ఒప్పందం కూడా కుదుర్చున్నట్లు చెబుతున్నారు. అలాగే దీంతోపాటే సరికొత్త ప్లాన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ధన్ ధనా ధన్ ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రూ.349, రూ.399తో రెండు ప్లాన్లు ప్రకటించిన జియో 21న జరగనున్న సమావేశంలో రూ.80-రూ.90 మధ్యలో ఉండే మరో ప్లాన్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే ఈ ప్లాన్ పాత వినియోగదారులకా? లేక కొత్తగా రాబోతున్న 4జీ ఫీచర్ ఫోన్‌కా? అన్న విషయంలో స్పష్టత లేదు.

వీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను కూడా ఆవిష్కరించనుంది. ఇప్పటికే పలు నగరాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఈ కనెక్షన్‌తో 100 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలలపాటు ఫ్రీగా అందించనున్నారు. అయితే ఈ సేవలు పొందాలంటే తొలుత రూ.4500 డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల రాజ్యం నడుస్తున్న సమయంలో కేవలం ఫీచర్ ఫోన్ అయినప్పటికీ 4జీ ద్వారా రిలయన్స్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jio  VoLTE  4G Feature Phone  

Other Articles