high court issues notices to four cabinet ministers ఆ నలుగురు మంత్రులకు హైకోర్టు జలక్..

High court issues notices to four cabinet ministers

notices, defected MLAs, high court, ysrcp, chandrababu cabinet, YSRCP, AP Assembly, amarnath reddy, adi narayana reddy, rao sujay krishna ranga rao, bhuma akhila priya, chandrababu naidu, ap assembly speaker, Kodela Shiva Prasad, andhra pradesh, TDP government

high court issues notices to four cabinet ministers namely, amarnath reddy, adi narayana reddy, rao sujay krishna ranga rao, bhuma akhila priya of chandrababu cabinet

ఆ నలుగురు మంత్రులకు హైకోర్టు జలక్..

Posted: 07/18/2017 09:01 PM IST
High court issues notices to four cabinet ministers

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టడంపై అశ్చర్యం వ్యక్తం చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు అటు ఆంధ్రప్రదేశ్ లోని నలుగురు మంత్రులతో పాటు ఇటు తెలంగాణలోని ఒక్క మంత్రికి నోటీసులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వంలోకి వలసవెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంపై దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇవాళ వారికి షాక్ ఇచ్చింది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అధికార పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కోనసాగుతున్న నేపథ్యంలో వారిని ఆ పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమంటూ జర్నలిస్ట్‌ శివప్రసాద్‌ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఆర్టికల్‌ 164 (1బి) ప్రకారం పార్టీ మారిన వారిని మంత్రులుగా నియమించడం చట్టవిరుద్ధమని పిటిషన్‌ శివప్రసాద్‌ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

దీనిపై నలుగురు మంత్రులకు హైకోర్టు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కేసును కూడా ఇదే కేసుతో విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దీంతో వైసీపీ పార్టీ బీఫారమ్ పై గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియలకు న్యాయస్థానం నోటీసులను జారీ చేసింది. వీరితో పాటు టీడీపీ పార్టీ తరపున గెలిచిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా నోటీసులు జారీ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : notices  defected MLAs  high court  ysrcp  chandrababu cabinet  YSRCP  AP Assembly  

Other Articles