Mass transfers in Excise Department సొంత శాఖ అధికారులకు చుట్టుకున్న డ్రగ్స్ కేసు

Mass transfers in excise department ahead of drugs case interrogation

Telangana, Excise enforcement department, mass transfers,, tollywood, akun sabarwal, actors drugs, directors drugs, celebrities drugs, drugs racket, Kelvin, Cocaine batch, courier agencies, excise department

Akun Sabharwal has made some radical changes to his team. About 159 members were transferred from Excise Department.

సొంత శాఖ అధికారులకు చుట్టుకున్న డ్రగ్స్ కేసు

Posted: 07/18/2017 08:08 PM IST
Mass transfers in excise department ahead of drugs case interrogation

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసు చివరకు సొంత శాఖకు చెందిన అధికారుల మెడకే చుట్టుకుంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో సీరియస్ గా వున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్.. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు అందే సమాచారం గొప్యంగా వుండాలని, నిందితులకు శిక్ష తప్పనిసరిగా పడాలని కృతనిశ్చయంతో వున్నారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన పలు బేరగాళ్ల అంశం కూడా ఆయన దృష్టికి వచ్చింది.

డ్రగ్స్ కేసులు మీ పిల్లల పేర్లు వున్నాయని వాటిని ఆ జాబితా నుంచి తొలగిస్తామని కొందరు కేటుగాళ్లు సంపన్న కుటుంబాల పిల్లల తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. ఇక డ్రగ్స్ కేసు జాబితా నుంచి
పేర్లను తొలగించడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో అయన సమయం చూసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికోన్ని గంటల వ్యవధితో డ్రగ్స్ కేసులో దర్యాప్తు ప్రారంభం కానున్న నేపథ్యంలో సొంత శాఖ అధికారులకు జలక్ ఇచ్చారు.

ఇన్నాళ్లు డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతున్నా.. నిద్రావస్థులో వుండి పట్టించుకోకుండా వదిలేసిన అధికారులపై ఉక్కుపాదం మోసారు. డ్రగ్స్ మాఫియా ఏకంగా విద్యార్థులను టార్గెట్ చేసుకునేంత వరకు నిశ్చేష్టులై చూస్తున్న అధికారులపై వేటు వేశారు. ఒక్కసారిగా సొంత శాఖకు చెందిన 212 మంది అధికారులపై బదిలీ వేటు వేశారు. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారన్న కారణాలతో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయి. వీరిలో 20 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 192 మంది సీఐలు బదిలీ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Excise enforcement  mass transfers  tollywood  akun sabarwal  Telangana  

Other Articles