government to implement new registration policy soon రిజిస్ట్రేషన్ అక్రమాలకు చెక్.. త్వరలో కొత్త విధానం

Government to implement new registration policy soon

new policy, new system, aadhaar based registration, aadhaar mandatory registration, telangana government, TRS leaders, registration, aadhar card, mandatory, data base matching, telangana

Telangana government, after been critisied by opposition parties as ruling party leaders scam and illegal registrations came into light, is ready to implement new registration policy soon

రిజిస్ట్రేషన్ అక్రమాలకు చెక్.. త్వరలో కొత్త విధానం

Posted: 07/12/2017 02:24 PM IST
Government to implement new registration policy soon

రిజిస్ట్రేషన్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగుచూడటంతో.. ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న క్రమంలో నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి.. ప్రతిపక్షాలకు బదులిచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి నూతన విధానాన్ని అమలుపర్చనుంది. నూతన విధానంతో ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అధార్ ను తప్పనిసరి చేయనుంది.

ఆధార్ నెంబరును అనుసంధానం చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేకుండా చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం అధార్ డాటాబేస్ తో తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ఇప్పటికే అనుసంధం చేసింది. అయితే కేవలం అధార్ నెంబరు చెప్పడమే కాకుండా వేలిముద్రతో పాటు అన్ని వివరాలు సరిచూసుకున్న తరువాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. లేని పక్షంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తారు. ఇక మరిన్నీ వివరాలు ఇలా వున్నాయి..

* రిజిస్ట్రేషన్ చేసేవారు, చేసుకునేవారు, సాక్షులు సహా అందరి ఆధార్ వివరాలు వేలిముద్రలతో సహా సరిపోలాలి.
* ఆధార్ కార్డు లేని వారు కార్డు కోసం నమోదు చేసుకుని 28 అంకెల ఎన్ రోల్‌మెంట్ సంఖ్య, దరఖాస్తు చేసిన ధ్రువీకరణను రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌ ఆమోదిస్తేనే రిజిస్ట్రేషన్ల వ్యవహారం జరుగుతుంది.
* ఈ నిబంధనలు వ్యక్తులతో పాటు  సంస్థలు, విద్యాసంస్థలు, హిందు అవిభాజ్య కుటుంబాలు సహా అందరికీ వర్తించనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : registration  aadhar card  mandatory  data base matching  telangana  

Other Articles