Nevada running out of weed, 'statement of emergency' declared అమెరికాలోని రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు.. అది దొరక్కే..!

Nevada legal marijuana shortage prompts statement of emergency

dan corey, marijuana, nevada, recreational marijuana, pot, utah, weed, state of emergency, America, US

Less than two weeks after Nevada began allowing recreational marijuana sales, stores are running out of pot to sell, according to the state’s Department of Taxation.

అమెరికాలోని రాష్ట్రంలో ఎమర్జెన్సీ.. అది దొరక్కే..!

Posted: 07/12/2017 02:41 PM IST
Nevada legal marijuana shortage prompts statement of emergency

అది అగ్రరాజ్యం అమెరికాలోని నెవడా రాష్ట్రం. పక్షం రోజుల క్రితమే ఈ రాష్ట్రాన్ని రిక్రియేషన్ కేంద్రంగా మారింది. దీంతో అమెరికాలో గంజాయి విక్రయాలను అధికారింకంగా విక్రయించే ఎనమిదవ రాష్ట్రంలో నిలిచింది. ఇందుకోసం అధికారికంగా గంజాయి విక్రయించేందుకు అక్కడ కొందరు దుకాణాదారులకు అనుమతులు కూడా ఇచ్చాయి. అయితే ఇందుకోసం భారీ మొత్తంలోనే గంజాయిని అక్కడి దుకాణాదారులు స్టాక్ గా పెట్టుకున్నారు. కేవలం పక్షం రోజుల్లో మొత్తం సరకుంతా అమ్ముడైంది. అయినా తమకు గంజాయి కావాలన్న వారి సంఖ్యలో మాత్రం తగ్గలేదు. దీంతో నెవడా గవర్నర్ రాష్ట్రంలో అత్యవసర నియంత్రణను ప్రకటించారు.

రాష్ట్రవాసుల నుంచి గంజాయి కొనుగోళ్లకు వున్న డిమాండ్ ను అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు వ్యాఖ్యానించగా, ఇంతభారీ మొత్తంలో స్పందన వస్తుందని తాము ఊహించలేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. దీనికి అసలు కారణం.. గంజాయిని చట్టబద్ధం చేసిన వెంటనే రాష్ట్రంలోని 47 అధికారిక గంజాయి రిటైల్ షాపులు నిండుకున్నాయి. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో ట్యాక్సేషన్ డిపార్ట్‌మెంట్ అత్యైక పరిస్థితులను ప్రకటించింది. లైసెన్స్ కలిగిన డిస్ట్రిబ్యూటర్లు తగినంత మంది లేకపోవడం కారణంగా పేర్కోంటున్నారు.

ఇక దీనితో పాటు పొలాల నుంచి గంజాయిని సేకరించడం ఇబ్బందిగా మారిందని దీని ప్రభావం కూడా అమ్మకాలపై పడిందని అంటున్నారు. దీంతో గంజాయి సరఫరాకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ట్యాక్సేషన్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గంజాయి మార్కెట్‌లో డిమాండ్‌ దృష్ట్యా ఈ రంగంలో యజమానులు వందల మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. గంజాయి విక్రయాలు చట్టబద్ధమైన వెంటనే వేలాదిమంది సిబ్బందిని నియమించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dan corey  marijuana  nevada  recreational marijuana  pot  utah  weed  state of emergency  America  US  

Other Articles