New Rules by RBI to Make Cashless Transactions Safer ఆ సేవల రక్షణకు ఆర్బీఐ కొత్త నియమాలు

New rules by rbi to make atm credit card online transactions safer

Reserve Bank of India, rbi new rules, rbi new rules for cashless transactions, online banking frauds, customer liability, atm, credit card, debit card, online transactions, demonetisations, rbi governor urjit patel

To curb these fears in cashless transactions, the Reserve Bank of India (RBI) has come out with a list of new rules with norms for limiting customer liability in online banking frauds.

ఇలా చేస్తే మీ డబ్బు పదిలం.. ఆర్బీఐ కొత్త నియమాలు

Posted: 07/07/2017 12:20 PM IST
New rules by rbi to make atm credit card online transactions safer

అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీ ఇత్యాది సమస్యలతో చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపర్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం నోట్ల రద్దు. ఈ నిర్ణయంతో నగదు రహిత లావాదేవీల వైపు దేశాన్ని పయనింపజేయాలని కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం, అర్బీఐ సహా బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా.. దేశంలోని అనేక మందిని మాత్రం ఈ లావాదేవీలు జరపడానికి తెలియని భయాలు.. అందోళనలు కలవరపెడుతున్నాయి. దీంతో కేంద్రం అశించిన స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు.

దీంతో ఏటీఎం, క్రెడిట్ కార్డ్‌, ఆన్‌లైన్ లావాదేవీల సేవ‌ల ర‌క్షణ కోసం భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త నియ‌మాలు విడుద‌ల చేసింది. అన‌ధికార న‌గ‌దు బ‌దిలీ త‌ప్పిదాల వ‌ల్ల న‌ష్టపోతున్న వినియోగ‌దారుల ప్రయోజ‌నాలను కాపాడేందుకు అర్బీఐ రంగంలోకి దిగి నూతన నియమాలను తీసుకువచ్చింది. దీంతో ఇక నగదు రహిత లావాదేవీలపై దేశ ప్రజలు ఎలాంటి అందోళన లేకుండా జరుపుకునేలా చర్యలు తీసుకుంది. అటు బ్యాంకులకు కూడా ఈ నియ‌మాలను వర్తింపజేసింది. ఈ నియమాలతో న‌గ‌దు ర‌హిత సేవ‌ల‌పై వినబడుతున్న భయాలను అర్బీఐ తొలగించే ప్రయత్నం చేసింది.

అయితే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న క్రమంలో అనధికారికంగా (మీ ప్రమేయం లేకుండా మోసాలకు గురైన పక్షంలో) మూడు రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని నిబంధన విధించిన అర్బీఐ.. అలా కాకుండా వారం రోజుల లోపు పిర్యాదులు చేస్తే.. డబ్బులో కొంత మొత్తాన్ని జరిమానాల రూపంలో నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది. వారం రోజులు దాటిన తరువాత అనధికార లావాదేవీల గుర్తించి బ్యాంకులకు పిర్యాదు చేసిన పక్షంలో వాటిపై నిర్ణయాధికారం పూర్తిగా బ్యాంకు బోర్డుపైనే వుంటుందని అర్బీఐ స్పష్టం చేసింది.

ఇక అర్బీఐ జారీ చేసిన పది నూతన నియమాలు ఒక్కసారి పరిశీలిద్దామా:-

1. అన‌ధికార న‌గ‌దు బ‌దిలీని 3 రోజుల్లోగా బ్యాంకుకు తెలియ‌జేస్తే కస్టమర్లు ఎలాంటి న‌ష్టం భ‌రించాల్సిన అవ‌స‌రం లేదు.
2. మూడు నుంచి 7 రోజుల్లోగా తెలియ‌జేస్తే, అకౌంట్ ర‌కాన్ని బ‌ట్టి గ‌రిష్టంగా రూ. 5000 - రూ. 25000ల వ‌ర‌కే ఖాతాదారుడు న‌ష్టాన్ని భ‌రించాలి.
3. వారం రోజుల త‌ర్వాత తెలియ‌జేస్తే సంబంధిత‌ బ్యాంకు విధివిధానాల‌ ప్రకారం వారు విధించినంత న‌ష్టాన్ని వినియోగ‌దారుడు భ‌రించాల్సి ఉంటుంది.
4. ఇక పిన్ నెంబర్, సాస్ వర్డ్ పలువురికి తెలియడంతో జరిగే అనధికార బదిలీ విషయంలో ఈ విషయమై బ్యాంకుకు పిర్యాదు చేసే వరకు బాద్యత ఖాతాదారుడిదే. అయితే అ తరువాత కూడా ఏదైనా లావాదేవీ జ‌రిగితే.. అ బాద్యత బ్యాంకుదే.
5. ఈ నియ‌మాలు ఏటీఎం, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పాయింట్ ఆఫ్ సేల్స్ సేవ‌ల‌పై వ‌ర్తిస్తాయి.
6. అన‌ధికార న‌గ‌దు బ‌దిలీ విష‌యంపై వినియోగ‌దారుని బాధ్యత‌ను రుజువు చేయాల్సిన భారం బ్యాంకుదే.
7. అన‌ధికార బ‌దిలీ ఫిర్యాదు నిజమే అని రుజువైతే, ఫిర్యాదు అందిన తేదీ నుంచి ప‌ది రోజుల్లోగా బ్యాంకు న‌ష్టప‌రిహారం చెల్లించాలి.
8. ఇలాంటి ఆన్‌లైన్ త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వినియోగ‌దారుని మొబైల్ నంబ‌ర్‌, ఈ-మెయిల్ వివరాలను అకౌంట్‌తో అనుసంధానం చేయ‌డాన్ని త‌ప్పనిస‌రి చేయాలి.
9. న‌గ‌దు సేవ‌ల‌కు సంబంధించిన మెసేజ్‌కు వినియోగ‌దారుడు రిప్లై ఇచ్చే సౌక‌ర్యం క‌లిగించాలి.
10. అలాగే బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల కోసం ఒక లింక్ ఏర్పాటు చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles