Thousands Of Job released by automation at Microsoft

It job cuts at microsoft soon

Microsoft, Microsoft Job cuts, Microsoft Automation, Techie Companies Automation, IT Job Cuts, Microsoft Corporation layoffs, Microsoft Sales and Marketing Employees

Microsoft Set To Announce Thousands Of Job Cuts. Microsoft Chief Executive Satya Nadella has sought to reduce the tech giant's focus on software, shifting to cloud computing and business services. Reorganise sales and marketing teams.

మైక్రోసాఫ్ట్ నుంచి బ్యాడ్ న్యూస్

Posted: 07/04/2017 10:17 AM IST
It job cuts at microsoft soon

సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు నడుం బిగించనుంది. ఆటోమేషన్, వ్యాపారం మందగించడం తదితర కారణాలను చూపుతూ ఇటీవలె పలు కంపెనీలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. ఇన్ఫోసిస్ ఏకంగా 11 వేల మంది ఉద్వాసనకు సిద్ధమైపోయింది. దీంతో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ రీఆర్గనైజేషన్ లో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కార్యకలాపాలను పూర్తిగా సమీక్షించనున్నామని, ఫలితంగా ఫీల్డ్ సేల్స్ తదితర విభాగాల్లో వేలమందిని తొలగించాల్సి రావచ్చని సంస్థ అధికారి ఒకరు చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

వారి స్థానంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ప్లాట్ ఫాంలను వినియోగించాలని భావిస్తున్నట్లు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వెల్లడించాడు. మార్చి నాటికి సంస్థలో 1,21,567 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని వారిపైనే ఈ వేటు ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, సోమవారం నాడు సంస్థ తన ఉద్యోగులకు ఓ లేఖను రాస్తూ, కమర్షియల్ సేల్స్ విభాగాన్ని రెండు సెగ్మెంట్లుగా విభజిస్తున్నట్టు పేర్కొంది. ఓ భాగం పెద్ద కస్టమర్లకు, మరో భాగం చిన్న, మధ్యతరహా కస్టమర్లకు సేవలందిస్తుందని, ఉద్యోగులను ఉత్పత్తి, ఆర్థిక సేవలు, రిటైల్, వైద్యం, విద్య, ప్రభుత్వాలకు సేవలు అంటూ ఆరు విభాగాలుగా విభజించామని పేర్కొంది.

సాఫ్ట్ వేర్ అమ్మకాలను నాలుగు విభాగాలుగా విభజించామని, మోడ్రన్ వర్క్ ప్లేస్, బిజినెస్ అప్లికేషన్స్, యాప్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా అండ్ ఏఐగా మార్చనున్నామని తెలిపింది. కాగా, మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే కస్టమర్లను ఆకర్షించే విషయంలో అమెజాన్, ఆల్ఫాబెట్ (గూగుల్) వంటి సంస్థలతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2014 లో నోకియా స్మార్ట్ ఫోన్లు దారుణంగా విఫలమైన సందర్భంలో 18,000 మందిని, ఇతరత్రా కారణాలతో 2015 లో 7,800 మందిని, గతేడాది 4,700 మందిని సాగనంపింది. ఇక ఇప్పుడు మళ్లీ తొలగింపు వార్తతో ఎవరిపై వేటు పడుతుందో తెలీక ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Microsoft  

Other Articles