public peeing, union minister caught in act దుకాణాదారులకు అభియాన్ కు కేంద్రమంత్రి ‘స్వచ్చ’ తూట్లు

Union minister caught urinating in public swachh bharat jokes on twitter

Radha Mohan Singh, Narendra Modi government, Narendra Modi, Swachh Bharat Mission, Twitter, Radha Mohan Singh twitter, Amit Shah, BJP, VIP culture, red beacon

Images of Union Minister Radha Mohan Singh urinating on what appears to be the wall of a compound, are being widely shared on social media.

అభియాన్ కు కేంద్రమంత్రి ‘స్వచ్చ’ తూట్లు

Posted: 06/29/2017 04:32 PM IST
Union minister caught urinating in public swachh bharat jokes on twitter

యావత్ దేశం ఇంటి మాదిరిగానే శుభ్రంగా వుండాలని విన్నవిస్తూ.. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం స్వచ్చా భారత్ అభియాన్ ను తీసుకువచ్చి.. ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా, కేంద్రమంత్రి మాత్రం అందుకు ఫూర్తి భిన్నంగా స్వచ్ఛందంగా ఈ అభియాన్ కార్యక్రమాలకు తూట్లు పోడుస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దేశం కూడా శుభ్రంగా వుంటుందని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా శుభ్రతను పాటించాలని కేంద్రం నినదిస్తుండగా, అదే కేంద్రంలోని మంత్రే ప్రధాని మాటలకు విలువను ఇవ్వడం లేదు. ఏకంగా బహిరంగంగా మూత్రవిసర్జన చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి.

ఇంతకీ ఎవరా మంత్రి అని అంటున్నారా..? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్. దేశంలోని రైతులు తమకు గిట్టుబాటు ధరలు లేక అంధోళన చేస్తూ రోడ్డపైకి వస్తుంటే.. ఈ మంత్రి బాబా రాందేవ్ తో కలసి యోగి చేస్తూ ఇటీవల విమర్శలపాలయ్యారు. ఇక తాజాగా ఆ మంత్రి ఓ గోడపై ముగ్గులేస్తున్నట్లుగా .. ఈ ఘనకార్యం నిర్వహిస్తుండగా సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉన్నారు. దీనిని ఎవరో స్థానికులు తమ మొబైల్ ఫోన్లో ఫోటోలు తీశారు. వాటిని తాజాగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, నెట్ జనులు తీవ్ర హస్యం అడుకుంటున్నారు. విపక్షాలకు చెందిన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నెట్ జనులు ఈ ఫోటోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే… ఇది ఆయన సొంత నియోజకవర్గంలోనే జరిగిందని సమాచారం. కాగా ఇది జరిగి కూడా సుమారు రెండు నెలలకు పైగానే అయ్యివుండవచ్చని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆయన కారుపై ఎర్రబుగ్గ వుండటంతో ఈ అనుమానాలు నిజమయ్యే అవకాశమే అధికంగా వుంది. గత రెండు మాసాలుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఐదుగురు మినహా ఎవరూ ఎగ్రబుగ్గను వినియోగించడం లేదు. దీంతో ఈ చిత్రాలు రెండు నెలల క్రితానివేనని రూడీ అవుతుంది.

ఏ వస్తువును కోనుగోలు చేసినా అందులోని 0.5 శాతాన్ని కేంద్రం ప్రజల నుంచి బలవంతంగా తీసుకుని స్వచ్ఛా భారత్ అభియాన్ కు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రజల నుంచి ధనం తీసుకోవడం మాత్రమే తెలసిన కేంద్రానికి నిజంగా స్వచ్ఛా భారత్ కోసం పాటుపడింది మాత్రం లేదంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రే ఏకంగా రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేస్తే.. అందుకు కూడా దేశ ప్రజలు అర్థరూపాయి మేర పన్ను కట్టాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radha Mohan Singh  Union minister  Swachh Bharat Mission  Twitter  Narendra Modi  Amit Shah  

Other Articles