Etela Rajender warns traders, not to hike rates in pretext of GST దుకాణాదారులకు తెలంగాణ మంత్రి వార్నింగ్..!

Etela rajender warns traders not to hike rates in pretext of gst

Etela Rajender, Finance minister Etela Rajender, Telangana Finance minister, Etela Rajender news, traders, hike prices, goods. commondities, Telangana

Telangana Finance Minister Etela Rajender warns traders, not to hike rates of goods in pretext of GST

దుకాణాదారులకు తెలంగాణ మంత్రి వార్నింగ్..!

Posted: 06/29/2017 03:16 PM IST
Etela rajender warns traders not to hike rates in pretext of gst

దేశంలో ఏకీకృత పన్ను వ్యవస్థలోకి తీసుకురానున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ (జీఎస్టీ) పేరుతో ధరలు పెంచొద్దని వ్యాపారులకు తెలంగాణ అర్థికశాఖా మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. జీఎస్టీ పేరుతో రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే సహించమని చెప్పారు. జీఎస్టీ పేరుతో అప్పుడే కొందరు వ్యాపారులు అధిక ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారని సమాచారం అందిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచే ధరల పెంచి విక్రయించడం నేరమన్నారు.

జూలై 1 నుంచి జీఎస్టీ అమలవుతుండటంతో.. రాష్ట్రంలో జీఎస్టీ మీద రివ్యూ చేసిన ఈటల.. చేనేతకు GST నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి తెలిపామని అన్నారు. ఏకీకృత పన్ను విధానంపై ఫిర్యాదుల కోసం 1800 425 3787 నెంబర్ ప్రకటించారు ఈటల. పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో వుందని తెలిపారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్ను రాబడిలో కేంద్రానికి 50 శాతం వెళ్తుందని.. మిగిలిన బాగాం రాష్ట్రాలకు దక్కుతుందని అన్నారు. సామాన్యులు వాడే ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులపై పన్నులు తక్కువ ఉంటాయన్నారు మంత్రి ఈటల అశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  Finance minister  traders  hike prices  goods. commondities  Telangana  

Other Articles