HC pulls up AP Govt over clean chit to Diwakar Travels

Cbn troubles continue with jc brothers

Diwakar Travels, Diwakar Travels AP Government, JC Brothers Chandrababu Naidu, CBN JC Brothers, Hyderabad High Court, Diwakar Travels Clean Chit, High Court AP Advocate General, Diwakar Travels Case, Moolapadu Mishap

Hyderabad High Court questioned the Andhra Pradesh state authorities for giving a clean chit to Diwakar Travels. The court asked the state government in what way did the authorities give a clean chit to Diwakar Travels bus which met with an accident killing 11 at Moolapadu village in Penuganchiprolu mandal of Krishna district.

బ్రదర్స్ తో బాబుకు అన్నీ తిప్పలే!

Posted: 06/28/2017 12:23 PM IST
Cbn troubles continue with jc brothers

రెండు నెలల క్రితం కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు వాగులో పడిన దుర్ఘటన గుర్తుండే ఉంటుంది. ఈ ఇష్యూలో ట్రావెల్స్ కు ఏపీ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంపై తెలుగు రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసులో తెలంగాణ, ఏపీ అధికారులు విడివిడిగా అఫిడవిట్ లు దాఖలు చేయగా, ఏపీ ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఉల్లంఘనలు లేవని పేర్కొంది. అయితే ఇదే సమయంలో తెలంగాణ రవాణా శాఖ చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్ లో మోటారు వాహన చట్టంతో పాటు కార్మికుల నిబంధనలు ఉల్లంఘించారని ఉంది.

దీంతో ఈ రెండింటినీ పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ టి రజనిలతో కూడిన ధర్మాసనం ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టాన్నే కాకుండా మోటారు వాహన కార్మికుల నిబంధనలను కూడా దివాకర్ ట్రావెల్స్ ఉల్లంఘించిందని, ఈ కారణంగానే ఆ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయని కూడా తెలంగాణ సర్కారు కాస్తంత స్పష్టమైన సమాచారంతోనే పిటిషన్ దాఖలు చేసింది.

దానికి విరుద్ధంగా దివాకర్ ట్రావెల్స్ మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించలేదని ఆ బస్సుల్లో అన్నీ సరిగానే ఉన్నాయని తెలిపింది. అయితే ఏపీ అఫిడవిట్‌ పై పలు సందేహాలున్నాయని కోర్టు పేర్కొనటం విశేషం. ఇక దివాకర్‌ ట్రావెల్స్‌ కార్యాలయం హైదరాబాద్‌ లో ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం అలా చెప్పిందని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామని దమ్మాలపాటి కోరగా, అన్నీ అక్రమమేనని టీ సర్కార్ చెబుతుంటే.. కరెక్టేనని ఎలా చెబుతారంటూ మండిపడింది. అదే సమయంలో ఏపీ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మరో విజ్నప్తిని కూడా కోర్టు అంగీకరించలేదు.

పూర్తి వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, న్యాయమూర్తులు మూడు వారాలు గడువు ఇచ్చారు. ఓవైపు వివాదాలతోనే కాదు.. ఇలా వరుస ప్రమాదాలతో జనాల ప్రాణాలు తీస్తూ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా జేసీ బ్రదర్శ్ మారుతున్నారన్న వాదన వినిపిస్తోంది. అయినా సరే చర్యలు ఎందుకు తీసుకోవటం లేదంటూ నిలదీసే యత్నం సీనియర్లు కూడా చేయకపోవటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad High Court  Diwakar Travels Mishpa  AP Government  Clean Chit  

Other Articles