Mumbai Blasts State to seek Death Penalty for Convicts

No death penalty for abu salem and riyaz

Deepak Salvi, Mumbai Blasts, Mumbai Blasts 1993, Mumbai Serial Blasts, Mumbai Blasts Convicts, Mumbai Blasts Convicts Death Sentence, Mumbai Blasts Punishments, Abu Salem Life Imprisonment, Firoz Abdul Mumbai Blasts, Mumbai Blasts Life Imprisonment

Special Public Prosecutor Deepak Salvi will demand the death penalty for conspirators Mustafa Dossa, Tahir Merchant and Firoz Abdul Rashid Khan and Karimullah Khan, who helped in landing ammunition for the blasts. The prosecution will ask for life imprisonment for gangster Abu Salem — who transported ammunitions — as his extradition terms forbid the death penalty.

ముంబై బ్లాస్ట్ కేసు: ఆ ఇద్దరికి మాత్రం ఉరి కష్టం!

Posted: 06/20/2017 08:08 AM IST
No death penalty for abu salem and riyaz

ముంబై మారణహోమం, 257 మందిని పొట్టన పెట్టుకున్న ఘోర కలి. చట్టాలు నిదానించటంతో కేసు ఇన్నాళ్లుగా సాగుతూ.. వస్తోంది. ఎట్టకేలకు ఆ రాక్షసులు చేసింది తప్పేనని తేలుస్తూ బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చింది. అయితే శిక్ష విషయంలోనే ఇంకా స్పష్టత రాకుండా పోయింది.

1993 బాంబు పేలుళ్లలో దోషులుగా తేలిన నలుగురికి మరణశిక్ష విధించాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ కోరింది. నాటి వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందగా, 713 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక న్యాయవాది దీపక్ సాల్వి ప్రత్యేక న్యాయస్థానానికి దరఖాస్తు సమర్పిస్తూ.. పేలుళ్లలో దోషులుగా తేలిన ముస్తాఫా దోసా (60), ఫెరోజ్ ఖాన్ (47), కరీముల్లా ఖాన్ (55), తాహెర్ మర్చెంట్ (55)లకు మరణశిక్ష విధించాలని కోరారు.

కాగా, మరో దోషి అబు సలేం (48)ను 2005లో పోర్చుగల్ నుంచి తీసుకువచ్చిన సమయంలో ఆ దేశానికి ఇచ్చిన హామీ మేర అతనికి 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించడానికి అవకాశం లేదని, అలాగే ఉగ్రవాదులకు కారు, నిధులు సమకూర్చిన రియాజ్ సిద్ధిఖీ (67)కి జీవితకాల శిక్ష, లేదంటే తక్కువలో తక్కువగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్టు డిఫెన్స్ పేర్కొంది.

పేలుళ్ల కేసులో వీరిని దోషులుగా తేల్చిన కోర్టు, శిక్షల ఖరారుపై డిఫెన్స్, ప్రాసిక్యూషన్ వాదనలు వింటోంది. వాటితో గనుక ఏకీభవిస్తే మిగతా నలుగురికి ఉరి శిక్ష ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Blasts 1993  Convicts  Abu Salem  Punishments  Life Imprisonment  

Other Articles