తెలుగులో మరీ ముఖ్యంగా తెలంగాణలో ఓక సామెత వుంటుంది. గేదలను చెరువులోకి పంపి.. వాటి కోమ్ములను చూపించి అమ్మడానికి బేరం పెట్టారని.. సరిగ్గా అదే విధంగా వుంది ప్రస్తుతం కేంద్రంలోని బీజేపి పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో.. నరేంద్రమోడీ ప్రభుత్వం అచితూచి అడుగులు వేస్తుంది. తన ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి పరిస్థితుల్లో అపఖ్యాతి రాకూడదని భావించి.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు వామపక్షాలకు చెందిన కీలక నేతలను ఇవాళ కలసి తమ అభ్యర్థికి మద్దుతు ఇవ్వాలని కోరింది.
ఈ క్రమంలో దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనించిన అధికార ప్రతిపక్షాల మధ్య చర్చలు అత్యంత పేలవంగా ముగిశాయి. అసలు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలియకుండా ఎవరికని, ఎలాగని మధ్దతును ఇస్తామన్న ప్రతిపక్షాల ప్రశ్నలతో అధికారపక్షం త్రిసభ్య కమిటీ ఖంగుతినింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన బీజేపీ త్రిసభ్య కమిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీని, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరిని కలిసింది. ఒక్కోక్కరితో కమిటి దాదాపు 30 నిమిషాల పాటు భేటీలు నిర్వహించింది.
తొలుత సోనియాను కలిసిన వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ లు.. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అభిప్రాయమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘మీ అభ్యర్థి ఎవరో చెప్పండి.. అవసరమైతే మేమే(ఎన్డీఏనే) మద్దతిస్తాం’ అని బీజేపీ నేతలు సోనియాతో అన్నట్లు సమాచారం. సమాధానంగా.. ‘మద్దతు కోసం వచ్చిన మీరు ఎవరికి మద్దతివ్వాలో ఆ పేరు చెప్పకుంటే ఎలా?’ అని సోనియా అన్నట్లు తెలిసింది.
‘వాళ్లు(బీజేపీ) అభ్యర్థుల పేర్లు చెప్పనేలేదు. అలాంటప్పుడు దీనిని చర్చలని కూడా అనలేం’ అని సోనియాతో బీజేపీ కమిటీ భేటీపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ‘పేర్లు చెప్పకుంటే ప్రక్రియ ముందుకు సాగనేసాద’ని మరో నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
ఆ తరువాత ఎన్డీఏ త్రిసభ్య బేటీ సభ్యులు వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు నేరుగా సీపీఎం కేంద్ర కార్యాలయానికి వెళ్లి సీతారం ఏచూరిని కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో సీపీఎం అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు వచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాం. అయితే ఎన్డీఏ అభ్యర్థి పేరు మాత్రం చెప్పలేదు. కాసేపటికి వెళ్లిపోయారు. అయినా పేరు చెప్పకుండా మద్దతెలా ఇస్తాం?’ అని ఏచూరి పేర్కొన్నారు. దీంతో ఈ భేటీపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. ఇది చేతులు కాలకముందే అకులు పట్టుకున్న చందంగా వుందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more