Jagga reddy autions vh braclet at press club కాంగ్రెస్ నేత వీహెచ్ బ్రస్ లెట్ ఖరీదు రూ.20 లక్షలా..

Congress senior leader vh s bracelet costs rs 20 lakhs

jaggareddy auctions braceler, jagga reddy chilli farmers, jagga reddy vh bracelet, jagga reddy, vh, bracelet, chilli farmers, congress, press club, vh presents bracelet to jaggareddy, vh keeps up rahul funny words, rahul gandhi vh jaggareddy, sangareddy meeting sucess gift, v, hanumantha rao, rahul gandhi, telangana

Congress leader Jagga Reddy conducted an auction of the bracelet gifted to him by Former Rajya Sabha MP V Hanumantha Rao.

ITEMVIDEOS: కాంగ్రెస్ నేత వీహెచ్ బ్రస్ లెట్ ఖరీదు రూ.20 లక్షలా..

Posted: 06/16/2017 05:47 PM IST
Congress senior leader vh s bracelet costs rs 20 lakhs

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు రాజకీయాల్లో అందులోనూ కాంగ్రెస్ అగ్రనేతల వద్ద పేరున్నా.. పెద్దగా సంపాదన మాత్రం లేని వ్యక్తి. అలాంటి నేత చేతికి దాదాపుగా రూ.20 లక్షల విలువైన బంగారు బ్రేస్ లెట్ వుందా..? దాని ఖరీదు అంతా..? అంటే అవుననే చెప్పాలి. ఆయన చేతికి తాకగానే బంగారానికి విలువ పెరగలేదు.. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సరదాగా అన్న మాటను ఆయన నిజం చేయడంతో దానికి అంత విలువ పెరిగింది. అదెలా వీహెచ్ చేతి గొలుసుకు రాహుల్ గాంధీకి లింక్ ఏంటీ..? అయినా వీహెచ్ బ్రేస్ లెట్ ను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి వేలం వేయడమేంటి..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్దామా మరి.

జూన్‌ ఒకటో తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు ముఖ్యఅతిధిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభ కోసం జగ్గారెడ్డి చాలా కష్టపడ్డారని.. ఎంతో ఖర్చు చేశారంటూ రాహుల్ దృష్టికి వీహెచ్‌ తీసుకెళ్లారు. మరి.. మీరేం ఇచ్చారంటూ రాహుల్ సరదాగా ప్రశ్నించగా.. నా దగ్గర ఏముంది? ఇవ్వటానికి అంటూ వీహెచ్ బదులిచ్చారు. వీహెచ్ చేతికి ఉన్న బంగారు బ్రేస్ లెట్ ను రాహుల్ చూపించటంతో వేదికపై ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.

ఈ ఎపిసోడ్ అక్కడితో ముగియలేదు. తర్వాతి రోజున వీహెచ్ స్పందిస్తూ.. తన బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి అందజేస్తున్నట్లు ప్రకటించి.. ఆయనకు బహుకరించారు. తానే స్వయంగా జగ్గారెడ్డి చేతికి తొడిగారు. తాజాగా ఆ బ్రేస్ లెట్ ను వేలం వేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. వేలంలో వచ్చే మొత్తాన్ని మిర్చి రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేలంపాట నిర్వహించారు. రూ.5 లక్షలతో ప్రారంభమైన వేలం.. కాసేపటికే రూ.20 లక్షలకు చేరుకుంది. అక్కడితో వేలం ముగిసినట్లుగా జగ్గారెడ్డి ప్రకటించారు. వేలంలో ఉత్సాహంగా పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి.. రూ.4 లక్షలు ఖరీదు చేసే బ్రేస్‌లెట్‌ను రూ.20 లక్షలకు సొంతం చేసుకున్న కృషి డెవలపర్స్ సంస్థను అభినందించారు. ఈ మొత్తాన్ని తాము ఖమ్మం.. వరంగల్‌ జిల్లాలకు చెందిన మిర్చి రైతులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు.. వేలంలో బ్రేస్‌లెట్‌ను సొంతం చేసుకున్నవారు.. కాంగ్రెస్‌ పార్టీ పేరు మీద చెక్ ఇచ్చారు. ఈ వేలంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagga reddy  vh  bracelet  chilli farmers  v hanumanth rao  congress  press club  telangana  

Other Articles