India will never be cowed down, says Manpreet Vohra భారత్ దౌత్యవేత్త ఇంటిపై రాకెట్ దాడి..

Indian ambassador s residence targeted in kabul no casualties reported

Kabul, India, Afghanistan, Rocket, Rocket lands, Indian Embassy, Indian Embassy in Kabul, rocket landed inside Indian embassy, Indian Ambassadors residence, Rocket in Indian embassy

A rocket exploded at the volleyball court at the Indian Ambassador’s residence located in the Indian Embassy in the Green Zone of Afghanistan’s capital, Kabul.

భారత్ దౌత్యవేత్త ఇంటిపై రాకెట్ దాడి.. జంకేది లేదన్న భారత్

Posted: 06/06/2017 05:22 PM IST
Indian ambassador s residence targeted in kabul no casualties reported

అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని తన రాయబారి నివాసంలో రాకెట్‌ పేలడం ద్వారా భారత్ ఎప్పటికీ జంకదని అప్ఘనిస్తాన్ లోని భారత రాయభారి మన్ ప్రీత్ వోరా అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలతో తమను భయాందోళనకు గురి చేద్దామనుకుంటే ఉగ్రపీచాలకు తాము అసలు బెదరమని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం భారత రాయభారి మన్ ప్రీత్ వోరా నివాసంలోకి రాకెట్ బాంబును టార్గెట్ చేసి ఉగ్రవాదులు పేల్చడం కలకలం రేపింది.

దీంతో ఆయన స్పందించి ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఉద్యమిస్తున్న తరుణంలో వారికి భారత్ కూడా మద్దతు పలుకుతుందని, ఇలాంటి చర్యలతో శాంతిని కోరుకునే దేశాలు ఎప్పటికీ భయపడవని అన్నారు. కాబూల్ లోని భారత ఎంబసీ కాంపౌండ్ లోని అతిథి గృహంలో రాకెట్ లాంచర్ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
 
భారత అతిథి గృహం కాంపౌండులో ఉన్న వాలీబాల్ మైదానంలో ఉదయం 11.45 గంటలకు రాకెట్ పేలుడు జరిగింది. ఆ సమయంలో భారత దౌత్యవేత్త మన్‌ప్రీత్ వోహ్రాతోపాటు ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది కూడా ఇంట్లోనే ఉన్నారు. గతవారం కాబూల్‌లోని దౌత్య ప్రాంతంలో భారీ ఉగ్రపేలుళ్లు చోటుచేసుకొని 150మందికిపైగా మృతిచెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారత దౌత్యవేత్త నివాసంలో రాకెట్ లాంచర్‌ పేలుడం ఆందోళన రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kabul attack  kabul blast  india house  manpreet vohra  afghanistan  

Other Articles