TDP MLC Deepak Reddy Land Grabbing History

Jc nephew arrested in land grabbing

MLC Deepak Reddy, AP MLC Arrest Telangana, AP MLC Land Grabbing, Deepak Reddy, JC Diwakar Reddy Nephew Arrest, AP TDP MLC Hyderabad Land Grabbing, Hyderabad Police Arrest TDP MLC, Deepak Reddy Land Grab History

AP TDP MLC Deepak Reddy Arrested In Hyderabad Forgery and Land Grabbing. Deepak Reddy is the son-in-law of Telugu Desam MP and businessman JC Diwakar Reddy.

దీపక్ రెడ్డి భూ కుంభకోణాల చరిత్ర పెద్దదే!

Posted: 06/07/2017 09:15 AM IST
Jc nephew arrested in land grabbing

భూ ఆక్రమణల కేసులో టీడీపీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి మేనల్లుడు, అనంతపురం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆసిఫ్ నగర్ లో రూ.163 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసినట్లు దీపక్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే వారిని నిన్న(మంగళవారం) రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ అవినాశ్ మహంతి చెప్పాడు. దీపక్ తోపాటు న్యాయవాది శైలేంద్ర సక్సేనా, రియల్టర్ శ్రీనివాస్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

దాదాపు రూ. 163 కోట్ల విలువైన భూములను దీపక్ రెడ్డి కబ్జా చేసినట్లు షేక్ పేట తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయన్ని అరెస్టు చేశారు. గుడిమల్కాపూర్ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో 78 ఎకరాల ఈనాం భూములను, బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2లో సుమారు 2.40 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే దీపక్ రెడ్డి, శైలేంద్ర సక్సేనాపై కేసు నమోదైంది. జేసీ మేనల్లుడు అయిన దీపక్ ఇటీవలే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు.


ఇక దీపక్ గత చరిత్రను తవ్వితే...

1. అయూబ్ కమల్ అనే వ్యక్తికి చెందిన బంజారాహిల్స్ లోని 3.37 ఎకరాల భూమిని, 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అయితే, 2008లో ఆ భూమిని అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖాజా మొహినుద్దీన్ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని దీపక్ రెడ్డి తరపు న్యాయవాది శైలేష్ సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని వారి నుంచి దీపక్ రెడ్డి కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలను తయారు చేశారు. తమ భూమిని ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ భూ కబ్జా నిరోధక కోర్టులో న్యాయవాది శైలేష్ ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ కేసు విచారణలో ఉండగా, కొన్ని నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను ఆ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చౌదరి తరపు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. న్యాయవాది శైలేష్ సహా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

2. అసిఫ్ నగర్ లో మొత్తం రూ.165 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు న్యాయవాది శైలేష్ పథక రచన చేయగా, దీపక్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. అసిఫ్ నగర్ లో ఓ సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సుమారు ఏడేళ్ల క్రితం శైలేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాల భూమిని నిజాం నవాబ్ తమకు ఇనాంగా ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని పత్రాలను శైలేష్ సమర్పించారు.

ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు శైలేష్ వి కావని పోలీసుల ప్రాథమిక ఆధారాల్లో తేలింది. శైలేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పారిపోయాడు. ఈ నేపథ్యంలో శైలేష్ ను సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో దీపక్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేయడం, ఆ విషయం అవాస్తవమని పోలీసుల విచారణలో తేలడం జరిగింది. చౌదరి బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారిని బెదిరించడం, పోలీసుల విచారణలో దురుసుగా వ్యవహరించడం వంటి కేసులు దీపక్ రెడ్డి పై గతంలో నమోదయ్యాయి.

ఇవేగాక మరికొన్ని చిన్న చిన్న కేసులు కూడా దీపక్ పై నమోదు అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  MLC Deepak Reddy  Land Grab  Arrest  

Other Articles