Jaleel Khan Solid Warning to Chandrababu on Muslim Quota

Tdp minority mla warn chandrababu

Vijayawada West MLA Jaleel Khan, Jaleel Khan Warn Chandrababu, Jaleel Khan Sensational Comments, Jaleel Khan Muslim Quota, B.Com Physics Jaleel Khan Warn, TDP MLA warn Chandrababu, Jaleel Khan Rail Torch Warn, Jaleel Khan Sensational Comments

Vijayawada West MLA Jaleel Khan warns Chandrababu Naidu on quota. TDP MLA Jaleel Khan's Explanation On B com physics.

బీకాంలో ఫిజిక్స్ వార్నింగ్ .. రైళ్లు తగలబెడతా!

Posted: 05/31/2017 11:40 AM IST
Tdp minority mla warn chandrababu

తెలుగు దేశం నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అదేనండీ బీకాం ఫిజిక్స్ ఫేం నేత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే కోరటంతోనే తాను పార్టీ మారనంటూ ప్రకటన చేశాడు. రంజాన్ ఉపవాస కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ముస్లింలను విస్మరించినా, వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా సహించేది లేదని ప్రభుత్వాన్నే హెచ్చరించాడు.

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం కేవలం రైలు తగలబెడితేనే వణికిపోయారు. కానీ, ముస్లిం కోటా విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం ముందు వెనకా ఆలోచించకుండా ఎన్ని రైళ్లు తగలబడతాయో చెప్పనంటూ హెచ్చరించాడు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుతో స్వయంగా చెప్పానని వెల్లడించాడు. అంతేకాదు ఏదైనా తేడా వస్తే మాత్రం రివర్సు గేర్ వేస్తానని పార్టీలో చేరినప్పుడే చెప్పినట్లు వివరించాడు. తాను అల్లాకు తప్ప ఎవరికీ భయపడనంటూ ఉద్వేగపూరిత ప్రసంగం ఇచ్చాడు.

జగన్ ఓ ఫూల్ అంటూ వ్యాఖ్యానించిన జలీల్, తనను ట్రోల్ చేస్తున్న వారిపైనా మండిపడ్డారు. సోషల్ మీడియా ఓ ఫేక్ మీడియా అంటూ ధ్వజమెత్తిన జలీల్ తన వీడియోలో ఎడిట్ వర్షన్ మాత్రమే ఇచ్చి బీకాం ఫిజిక్స్ వ్యాఖ్యలను ప్రజెంట్ చేశారని, నిజానికి అక్కడ నేను మాట్లాడింది వేరేనంటూ మరోసారి వాటిపై క్లారిటీ ఇచ్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Jaleel Khan  Chndrababu Naidu  Muslim Quota  

Other Articles