Azam Khan Bizarre Advice to Women to Escape from Rape

Azam khan on rampur molesting incident

Uttar Pradesh Molestation, Azam Khan, Azam Khan Molestation, Azam Khan Rape Comments, Azam Khan Rampur Molestation, Azam Khan Yogi Adityanath, Yogi Adityanath Rampur Molestation, Azam Khan Controversy, Azam Khan Controversial Comments, Azam Khan Suggest Woman, Azam Khan Comments, Azam Khan Stay indoor Comments, Azam Khan BJP, UP Molestation Video, Escape from Rape Azam Khan

SP Senior Leader Azam Khan does it again. keep women indoors to prevent molestation he says after Rampur Molestation Video Viral. Blames CM Yogi Adityanath, media's negligence for increasing crime in UP.

రేప్ తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం

Posted: 05/29/2017 09:34 AM IST
Azam khan on rampur molesting incident

మహిళా భద్రతే ప్రధాన లక్ష్యమంటూ చెప్పుకొస్తున్న బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఉత్తర ప్రదేశ్ ఏ మాత్రం సురక్షితం కాదని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. వారం రోజుల్లో మూడు గ్యాంగ్ రేప్ లు జరగటమే కాదు.. నిన్న రాంపూర్ లో ఇద్దరు మహిళలను 14 మంది అసభ్యంగా తాకుతూ దారుణంగా వేధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక ఘటనపై స్పందించిన వివాదాస్పద నేత, మాజీ మంత్రి అజాం ఖాన్ షాకింగ్ కామెంట్లు చేశాడు. అమ్మాయిలు, మహిళలు అత్యాచారాల నుంచి తప్పించుకోవాలంటే ఇంటికే పరిమితం కావాలంటూ సలహా ఇస్తున్నాడు ఈ ఎస్పీ సీనియర్ నేత. వీడియోలో ఉన్న వ్యవహారం చాలా చిన్నదేనన్న రీతిలో మాట్లాడిన ఖాన్, యోగి పగ్గాలు చేపట్టాక ఈ దారుణాలు మరీ పెరిగిపోయాయంటూ విమర్శలకు దిగాడు. బులంద్ షర్ అత్యాచార ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, అఖిలేష్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికే అని.. కామెంట్లు చేసి తీవ్ర విమర్శల పాలయ్యాడు అజాం ఖాన్. ఇక ఇప్పుడు అమ్మాయిలు అలాంటి ప్రాంతాలకు వెళ్లిపోకపోవటమే మంచిదంటూ వ్యాఖ్యానించి మరో కాంట్రవర్సీకి రెడీ అయిపోయాడు.

ఇదిలా ఉంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలోని ఓ గ్రామ సమీపంలో 14 మంది యువకులు ఇద్దరు మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆపై ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియా సైట్లలో పోస్టు చేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు వేధింపుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెట్ల కొమ్మలు అడ్డురావడంతో నిందితుల గుర్తింపు కష్టసాధ్యంగా ఉందని ఎస్పీ విపిన్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP Molestation  Azam Khan  Controversial Comments  

Other Articles