AU Students Protest against MLC MVVS Murthy Comments

Tdp mlc comments on andhra university

MLC Murthy, TDP Vizag MLC MVVS Murthy, GITAM MVVS Murthy, MLC Andhra University, Murthy Comments on Andhra University, AU Protests, AU MLC Comments, MLC Murthy AU Commmets, AU Students Fire MLC, VVS Murthy AU Comments

TDP Vizag MLC VVS Murthy Comments on Andhra University. AU Student protest for derogatory comments demands apology. Minister Ghanta also condemned Murthy Comments.

ITEMVIDEOS:ఏయూపై మూర్తి కామెంట్స్ మిస్ ఫైర్

Posted: 05/25/2017 02:48 PM IST
Tdp mlc comments on andhra university

ఏపీ అధికార పక్ష నేతలు డ్యామేజ్ కంట్రోల్ కూడా కాలేని రేంజ్ లో కామెంట్లు చేస్తూ వివాదాస్పదం అవుతున్నారు. శాసనమండలి సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి ఆంధ్రా యూనివర్సిటీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దుమ్ముపట్టి, గబ్బిలాలు తిరుగుతూ దయ్యాల కుప్పలాంటి ఆంధ్రా యూనివర్సిటీ... అంటూ చేసిన కామెంట్లపై విద్యార్థులు ఆందోళనకు దిగారు.

తెలుగుదేశం పార్టీ మహానాడుకు వాడుకోవటంపై ప్రతిపక్ష వైఎస్సార్పీపీ విమర్శించటం తెలిసిందే. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగిన మూర్తి నోరు జారి ఏయూపై కామెంట్లు చేశాడు. మహానాడుకు ఏయూ ను వాడుకోవటాన్ని రాజకీయం చేయటం తగదంటూ చెబుతూ బూజు బంగాళాలా అంటూ వ్యాఖ్యాలు చేశాడు. సెలవుల్లో ఏయూ గ్రౌండ్‌ వాడుకుంటే తప్పేంటి? పైగా మహానాడు నిర్వహణతో ఏయూ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందన్నాడు.

 

దీనిపై ఏయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. మూర్తి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే మహానాడును జరగనివ్వమని హెచ్చరించాయి. కాగా, ఈ కామెంట్లపై మంత్రి గంటా శ్రీనివాస్ కూడా మండిపడ్డాడు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలు సమంజసంగా లేవంటూ ఆక్షేపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra University  MLC MVVS Murthy  Students Protest  

Other Articles