Maha CM Fadnavis survives chopper crash in Latur వైఎస్ తరువాత ఫడ్నవిస్.. అదే ప్రమాదం.. కానీ సేఫ్..

Maha cm fadnavis survives chopper crash in latur

Maharastra CM survives chopper crash, Devendra Fadnavis survives chopper crash, CM chopper crash in Latur, devendra fadnavis chopper crash, devendra fadnavis, devendra fadnavis accident, devendra fadnavis, chopper crash, unhurt, latur, maharastra

A chopper flying with Maharashtra CM Devendra Fadnavis crash landed in Nilanga in Latur, Maharashtra. The helicopter developed a technical snag during take off causing it to crash land. The chief minister and the team in the chopper have escaped unhurt.

ITEMVIDEOS: పెను ప్రమాదం నుంచి మహా ముఖ్యమంత్రి సేఫ్

Posted: 05/25/2017 03:01 PM IST
Maha cm fadnavis survives chopper crash in latur

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పెను ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం బారిన ఆయన పడినా.. సురక్షితంగా బయటపడటంతో మహారాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తం బీజేపి నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్‌ ప్రాంతంలోక్రాష్‌ అయ్యింది. అయితే ఈ ప్రమాదం నుంచి సీఎం ఫడ్నవీస్‌, ఆయన నలుగురు సభ్యుల బృందం క్షేమంగా బయటపడ్డారు. తక్కువ ఎత్తు నుంచి హెలికాప్టర్ నెలకూలడంతో సీఎం సురక్షితంగా బయటపడ్డారు.

ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయ్యిందన్న సమాచారంతో అనేక మంది బీజేపి నేతలు, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి ఆయనకు ఫోన్లు వెళ్లాయి. దీంతో స్వయంగా దేవేంద్ర ఫడ్నవిస్ ట్విట్ చేశారు. మా హెలికాప్టర్‌ లాతూర్‌లో ప్రమాదానికి గురైంది. అయితే నాతో పాటుగా మా బృందం మొత్తం సురక్షితంగా బయటపడ్డాం. ఎలాంటి ఆందోళన పడాల్సింది ఏమీలేదని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాగా పదిరోజుల క్రితమే ఈ ఛాపర్ లో సాంకేతిక లోపం తలెత్తగా మళ్లీ దానిని లాతూర్ వెళ్లేందుకు ఎందుకు వినియోగించారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఫడ్నవీస్‌ ప్రయాణిస్తున్న ఛాపర్‌ను అత్యవసర పరిస్థితుల్లో లాతూర్‌ సమీపంలోని నిలంగలో రహదారిపై దించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛాపర్‌ క్రాష్‌ల్యాండ్‌ అవడంతో ప్రమాదం చోటుచేసుకుందన్న సమాచారంతో రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటన తనను షాక్ కు గురిచేసిందని.. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారని తెలియడం ఆనందకరమని అన్నారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆయన ఫడ్నవిస్ కు ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

అయితే హెలికాప్టర్ ప్రమాధం అనగానే తెలుగు ప్రజలకు గుర్తుకువచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదం. సెప్టెంబర్ 2న జరిగిన ఈ ప్రమాదాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అయితే సరిగ్గా అలాంటి ప్రమాదాన్నే పోరుగు రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఎదుర్కొన్నారని సమాచారంతో తెలుగు ప్రజలు కూడా అందోళనకు గురయ్యారు. అయితే ఆయన సేఫ్ అని తెలియడంతో.. ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devendra fadnavis  chopper crash  unhurt  latur  maharastra  

Other Articles