chandrababu scared of arrest by modi suspects vundavalli మోడీ అరెస్టు చేయిస్తారన్న భయం చంద్రబాబకు పట్టుకుందా..?

Vundavalli demands white paper on the implementation of ap re organisation act

Former MP of Rajamahendravaram, EX MP Vundavalli Arun Kumar, State government, AP Re-organisation Act, AP Chief Minister, Chandrababu, YS Jagan, Central Government, PM Modi, white paper

Former MP of Rajamahendravaram Vundavalli Arun Kumar mentioned that during the last three years, Centre has not done anything to the state and wondered how it will fulfill the aspirations of the State.

మోడీ అరెస్టు చేయిస్తారన్న భయం చంద్రబాబకు పట్టుకుందా..?

Posted: 05/21/2017 07:52 AM IST
Vundavalli demands white paper on the implementation of ap re organisation act

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మండిప‌డ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా కేంద్రం పునర్విభజన చట్టానికి లోబడి ఏలాంటి కార్యక్రమాలు చేయలేదని, మరి రానున్న రెండేళ్లలో రాష్ట్ర ప్రజల అశలను ఎలా నేరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం 16 వేల కోట్ల రూపాయల అర్థిక సహకారాన్ని రాష్ట్రానికి అందించాల్సి వుండగా, కేవలం 7 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చిందని ఆయన తెలిపారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ క‌లిసిన విషయంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం వెనుక వారికి ఏదో భయం పట్టుకున్నట్లు అనిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు నాయుడు.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామ‌న్నార‌ని పేర్కొన్నారు. గ‌తంలో గోద్రా అల్లర్లు జ‌రిగిన అనంత‌రం మోదీ దేశ పర్యటన చేస్తున్నప్పుడు, ఆయ‌న‌ హైదరాబాద్‌కు వస్తే అరెస్ట్‌ చేస్తామని 2003 ఆగస్టు 27న చంద్ర‌బాబు ప్ర‌క‌టించార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

అదే విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకున్నారేమోన‌ని చంద్ర‌బాబు ఆందోళన చెందుతున్న‌ట్లు త‌న‌కు అనిపిస్తోంద‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. అవినీతి, ఓటుకు నోట్లు వంటి కేసుల నేపథ్యంలో మోదీ త‌న‌పై చర్యలు తీసుకుంటారేమోనని తనను అరెస్టు చేయిస్తారేమోనన్న అందోళన చంద్ర‌బాబుతో పాటు టీడీపీ నేతల్లో స్పష్టమవతుందని అన్నారు. రానున్న కాలంలో మోదీ, జగన్‌ కలిసి ముందుకు వెళ‌తారేమోన‌ని టీడీపీ నేతలు ఆందోళ‌న చెందుతూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఉండవల్లి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vundavalli Arun Kumar  AP Re-organisation Act  Chandrababu  YS Jagan  PM Modi  

Other Articles