Special Story on Mamdapur and Kanjasa Villages

North india special villages stories

Aadhar Village, Village Aadhar Number, Aadhar Entire Village Same DOB, Same DOB on Aadhar, Aadhar Mistakes, Aadhar Kanjasa village, Mamdapur village, Nashik Deer Village, Mamdapur Deer Village, North India Special Villages, School Children Aadhar, Aadhar Errors UP, Indian School Girls Aadhar

In Uttar Pradesh Aadhaar cards of all residents of Kanjasa village Allahabad mention their date of birth as January 1. No man animal conflict here deer take shelter in Mamdapur village at Nashik Maharashtra.

ఇవి చాలా విచిత్రమైన ఊర్లు బాస్...

Posted: 05/20/2017 04:02 PM IST
North india special villages stories

అన్నింటికి ఆధార్ తో లింకులు పెట్టి అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం దోషిగా నిలబడి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.భద్రతా రీత్యా పలు బ్యాంక్ అకౌంట్లు, వ్యక్తిగత సమాచారం లీక్ అయిన నేపథ్యంలో పలు పశ్నలు సంధించిన విషయం తెలిసిందే. అయితే తమ తరపున ఎలాంటి తప్పులు లేవని, కేవలం ప్రభుత్వ కార్యాలయాల నుంచి మాత్రమే ఆ డేటా చోరీ జరిగిందని యూఐడీఏ క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఆధార్ లోని డొల్లతనం మరోసారి బయటపెట్టే ఘటన యూపీలో చోటు చేసుకుంది.


అలహాబాద్‌ సమీపంలోని కంజాసా గ్రామం అది.పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్న‌ అంద‌రు విద్యార్థుల ఆధార్‌ కార్డు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని యోగి స‌ర్కార్ ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిల్లలంతా త‌మ త‌మ‌ ఆధార్‌కార్డుల జిరాక్సుల‌ను ఇవ్వగా,అవి పరిశీలించిన టీచర్లకు పెద్ద షాకే కొట్టింది. ఎందుకంటారా? పిల్ల‌లందరి పుట్టిన తేదీ జనవరి 1గాఉంది. ఒక్క విద్యార్థులదే కాదు ఆ గ్రామంలో 10,000 మంది ప్రజల ఆధార్ కార్డులలో ఇదే తేదీ నమోదైంది.


దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా తప్పు దొర్లిందని ఒప్పేసుకున్న గ్రామాధికారి రామ్ దులారి తిరిగి కొత్త కార్డులు ఇష్యూ చేసేందుకు సిద్ధమైపోయాడు.

 

మనుషులతోపాటే జంతువులు కూడా...


పట్టణీకరణ పేరిట మనిషి ఒక్క ప్రకృతికే కాదు సమస్త జీవరాశికి కూడా హని చేస్తున్నాడు. తమ నివాసాలు కనుమరుగు అయిపోతుండటం, ఆకలి దప్పికలు వెరసి మూగజీవులు సమీపంలోని గ్రామాలపై ఎగబడిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని మాందాపూర్ గ్రామం మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ మనుషులతో సమానంగా మూగజీవాలు కూడా నివసిస్తుంటాయి.


ముఖ్యంగా దుప్పులు ఇక్కడ గ్రామస్తులతోపాటే కలియ తిరగటం విశేషంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా వాటికి భయం, సిగ్గు ఎక్కువ. అలాంటిది మనుషుల మధ్య ఇలా నివసించటం ఆశ్చర్యం కలిగించేదే అయినా తరతరాల నుంచి అవి అలా కలిసిపోయాయని సామాజిక వేత్త ప్రకాశ్ గుద్గే చెబుతున్నాడు. తమకు దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూనే గ్రామస్థులను ఇబ్బంది పెట్టకుండా వారు అందించే ఆహారాన్ని ఇవి స్వీకరిస్తుంటాయంట. రాను రాను పర్యాటక రంగానికి ఈ గ్రామం ఎంతో ప్రసిద్ధి అవుతుండటంతో మరిన్ని సౌకర్యాలను కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhar Card  Same DOB  Deer Village  Maharasthra  

Other Articles