YSRCP Bans Andhra Jyothi From Their Meetings

Ysrcp ban on andhra jyothi and abn channel

YSRCP Ban Andhra Jyothi, Andhra Jyothi Ban, Andhrajyothi Ban, Jagan ABN Andhra Jyorhi, Andhra Jyothi ABN Channel, YSRCP Party Meetings, Media Not Allow to YSRCP Meeting, Anti Jagan Articles Media Ban, Jagan Press Meet Ban, Andhra Jyothi and ABN Channel, Andhra Jyothi Ban YS Jagan, Jagan Party Ban Yellow Media

YSRCP Ban ABN Channel and Andhra Jyothi Paper for Party Meetings. Anti Jagan Articles reason for ban.

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ను బ్యాన్ చేసేశారు

Posted: 05/15/2017 04:15 PM IST
Ysrcp ban on andhra jyothi and abn channel

తెలుగు రాష్ట్రాల్లో మీడియా పక్షపాత ధోరణులు కొనసాగటం కొత్తేం కాదు. ఓపార్టీకి ఓ పేపర్, మరో పార్టీకి మరో పేపర్ ఇలా మీడియాను మ్యానేజ్ చేస్తూ సాగే రాజకీయాలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఒక్కోసారి వాట్లో విమర్శలు శృతి మించిపోవటం, యెల్లో మీడియా అంటూ ఇరు పక్షాలు దుమ్మెత్తిపోసుకోవటం చూస్తుంటాం. ఆ మధ్య తనపై లేనిపోని కథనాలు రాస్తుందన్న కోపంతో ఏకంగా ఆ పత్రిక ప్రతినిధులను మీడియా సమావేశాలకు కూడా అనుమతించలేదు ఏపీ సీఎం చంద్రబాబు.

జగన్ గురించి ఏం రాశారంటే...

ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కూడా దాదాపు అలాంటి పనే చేస్తోంది. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేక కథనాలు ప్రచురిస్తుందని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశాడు. టీడీపీ జెండాను భుజాన మోస్తూ... తప్పుడు వార్తలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా సమస్యల గురించే ప్రధాని మోదీతో జగన్ భేటీ అయితే వినతి పత్రంలో వ్యక్తిగత ప్రయోజనాలంటూ లేనిపోని కథలు రాసిందని మండిపడ్డాడు.

పత్రికా విలువలను ఆంధ్రజ్యోతి పూర్తిగా వదిలేసిందని అన్నారు. జగన్ ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు వార్త రాసిన జ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ కు లేఖ రాస్తామని చెప్పారు. పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు. గత మూడేళ్లుగా జగన్ పై ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు విషం కక్కుతున్నాయని అన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికను గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల వరకు వైసీపీ బహిష్కరిస్తోందని భూమన తెలిపారు. తమ పార్టీ కార్యాలయాలకు కూడా ఆ పార్టీ విలేకరులు రావాల్సిన అవసరం లేదని చెబుతూ బ్యాన్ ను ప్రకటించింది వైఎస్సార్సీపీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  ABN Channel  Andhra Jyothi Ban  

Other Articles