Consumers can now buy 'digital gold' using Paytm పేటీయం బంగార పెట్టుబడుల పథకం..

Akshaya tritiya 2017 paytm offers digital gold for as low as re 1

paytm digital gold offer, paytm digital gold, paytm akshaya triiya offer, paytm akshaya tritiya, paytm akshaya tritiya gold offer, World Gold Council, PayTM, MMTC-PAMP, digital gold, Akshaya Tritiya

Alibaba-backed Paytm has partnered with gold refiner MMTC-PAMP to launch ‘Digital Gold’ that will allow customers to buy and sell gold through the electronic platform.

పేటియం అక్షయ తృతీయ (డిజిటల్ గోల్డ్) అఫర్.. ఇక రూపాయితో బంగారం..

Posted: 04/28/2017 12:01 PM IST
Akshaya tritiya 2017 paytm offers digital gold for as low as re 1

ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటీఎం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారం కొనేందుకు అచ్చంగా కుందనం లాంటి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరీ ముఖ్యంగా కనీసం మూడు వేల రూపాయలు వుంటే తప్ప ఒక గ్రాము బంగారాన్ని కొనలేమని చెప్పే దుకాణాదారులను కాదని ఏకంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని అద్బుతమైన ఆపర్ ను తీసుకువచ్చింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్‌ను ప్రారంభించింది.

ఈ ఆఫర్ ద్వారా 999.9 స్వచ్ఛత గల 24 క్యారెట్ల బంగారాన్ని రూపాయి అంతకంటే తక్కువ మొత్తంలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు చేసిన పసిడిని ‘డిజిటల్ గోల్డ్’ వ్యాలెట్‌లో దాచుకోవచ్చు. ఇక బంగారంతో వ్యాపారమంటే తెలియని వర్గాలను కూడా ఇకపై బంగారంలో తమ ఇష్టానుసారంగా పెట్టుబడులు పెట్టించి ఆ తరువాత వారిని క్రమంగా వ్యాపారం చేయడం దిశగా కూడా మల్లించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. పేటియం డిజిటల్ వ్యాలెట్ లో దాచుకున్న బంగారాన్ని వారి అవకాశాలకు అనుగూణంగా మర్చుకునే వెసలుబాటు కల్పించింది పేటీయం.

బంగారాన్ని కావాలనుకున్నప్పుడు దానిని ఇంటికి డెలివరీ చేయమని అర్డర్ ఇవ్వడం చేయవచ్చు.. లేదు తాము పెట్టిన పెట్టుబడికి అధికమొత్తం వస్తుందంటే దానిని ఆన్‌లైన్‌లో విక్రయించుకోవచ్చు. ఇలా మధ్యతరగతి వారిని కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టే దిశగా చేస్తుంది పేటీయం. ఎంఎంటీసీ-పీఏఎంపీ సంయుక్తంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఎవరికి తగ్గ స్థాయిలో వారు బంగారం కొనుగోలు చేసుకునేందుకు, బంగారంలో డిజిటల్ గోల్డ్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇదో సులభమైన మార్గంగా మారనుంది. కాగా  అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారాన్ని వినియోగదారులు కావాలనుకున్నట్టు నాణేల రూపంలో వారి ఇంటికి డెలివరీ చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World Gold Council  PayTM  MMTC-PAMP  digital gold  Akshaya Tritiya  

Other Articles