one nation one election not possible says nara lokesh ఏకకాల ఎన్నికలకు ఎలా సాధ్యమని లోకేష్ ప్రశ్న

One nation one election not possible says nara lokesh

nara lokesh one time elections, nara lokesh one nation one election, nara lokesh on parliament, assembly elections, nara lokesh, chandrababu, one nation one election, PM Modi, Election commission, one time elections, parliament elections, assembly polls, India news, latest news

AP minister and Tdp general secretary nara lokesh differences with union government idea of one nation one election, says it is not possible in vast democratic country like India.

జమిలీ ఎన్నికలపై చిన్నబాబు పెదవివిరుపు

Posted: 04/27/2017 12:39 PM IST
One nation one election not possible says nara lokesh

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ యోచనలో వున్న వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాన్ని ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భిన్నంగా స్పందించారు. మరోలా చెప్పాలంటే పెదవి విరిచారు. భారత్ లాంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహణ అసాధ్యమని చెప్పారు. 29 రాష్ట్రాలున్న దేశంలో ఏకకాల ఎన్నికలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. విభిన్న సంస్కృతులకు అలవాలమైన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ అసాధ్యమని అభిప్రాయపడ్డారు.

దేశంలో ముందస్తు ఎన్నికలు రావచ్చునని, అది కూడా వచ్చే ఏడాది నవంబర్ మాసంలో వచ్చే అవకాశాలు వున్నాయని, వాటికి ప్రతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్దంగా వుండాలని మంత్రులు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో నారా చంద్రబాబు చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే మంత్రి లోకేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని, అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోనడానికి పార్టీ నేతలు సిద్దంగా వుండాలని మాత్రమే చెప్పారని లోకేష్ చెప్పారు.

అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అటు పార్టీ నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో మైత్రి పెట్టుకున్న చంద్రబాబు.. వారి అలోచనలను తూచా తప్పకుండా పాటిస్తుండగా, చిన్నబాబు మాత్రం తన దారి తనదేనని తేల్చిచెప్పే ధోరిణిలో వెళ్లడం శుభసూచకమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికోందరు మాత్రం కేంద్రం అలోచనలను లోకేష్ అర్థం చేసుకోలేదని, అందుకనే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles