Kodandram says T-JAC never turn into political outfit.

T jac not turn into political outfit

Prof Kodandram, T-JAC Political Party, T-JAC Political Outfit, Kodandram New Political Party, Kodandaram 2019 Elections, Telangana Joint Action Committee, Kodandram Party, JAC Party, Kodandram Rumours

Prof Kodandram gives clarity on T-JAC turns into political outfit. No more plans for that in future he added.

కోదండరాం సార్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు

Posted: 04/27/2017 01:21 PM IST
T jac not turn into political outfit

తెలంగాణ రాజకీయాల్లో ప్రోఫెసర్ కోదండరాం గత కొంత కాలంగా రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. తెర వెనుక వ్యవహారాలు ఏంటో తెలీదుగానీ గులాబీ బాస్ తో అంటిముట్టనట్లు ఉన్న ఆయన తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నాడు. కేవలం కాంగ్రెస్ అండతోనే ఆయన అంతలా ఎగిరెగిరి పడుతున్నారని టీఆర్ఎస్ విమర్శలు చేయటం, అంతగా దిగజారలేదని కౌంటర్ లు ఇలా సాగిపోతూ వస్తుంది.

అయితే వెనకాల కాంగ్రెస్ అండ లేదన్న ఆయన మెల్లిగా టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చేయబోతున్నాడా? అన్న అనుమానాలు క్రమంగా మొదలయ్యాయి. కీలక నిర్ణయాల సమయంలో తోటి నేతలతో విభేధాలు, బయటికి వచ్చిన వాళ్లు ఓపెన్ గా ఫ్రోఫెసర్ పై విమర్శలు చేయటం దానికి ఊతమిచ్చాయి. దీనికి తోడు 2019 ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగుతారనే మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. కానీ, పొలిటికల్ జేఏసీ పార్టీగా మారే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశాడు.

 

ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన తనకు లేదని, టీజేఏసీ ఎప్పటికీ ప్రజా సంస్థగానే పని చేస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ధోరణి తమకు లేదని, కేవలం సైద్ధాంతిక పరంగానే వాళ్లపై విమర్శలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపాడు. జీవో నెం.123కు సవరణ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలనే మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని కోదండరాం ప్రస్తావించాడు. ఈమధ్య రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి పథకాన్ని స్వాగతిస్తున్నామని, రైతులకు ఏమాత్రం సాయం అందినా హర్షిస్తామని, పూర్తి స్థాయి వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Professor Kodandaram  TJAC  Political Party  

Other Articles