couple tie the not in graveyard | ఇదేం పెళ్లి రా బాబోయ్... ఏం చేశారో చూడండి.

Maharashtra couple tie the not in graveyard

Maharashtra Couple Wedding, Manju Sri and Akash, Graveyard Marriage, Burrial Ground Marriage, Maharashtra Graveyard Marriage, Graveyard Wedding, Jalna Masan Jogi Marriage, Jalna Wedding, Variety Marriage, Couple Tie the Not Graveyard

Maharashtra couple tie the not in graveyard. Jalna Masan Jogi caste couple Manju Sri and Akash married a burrial ground to educate people.

విడ్డూరం: చావు ప్లేస్ లో పెళ్లి చేసేశారు

Posted: 04/25/2017 08:24 AM IST
Maharashtra couple tie the not in graveyard

ఏదైనా సరిగ్గా చెబితే పట్టించుకుంటారా? తేడాగా చెబితేనే వింటారు? మనమూ పాపులర్ అవుతాం... అని ఆ మధ్య ఓ నేత తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హీరో అయిపోవటం చూశాం. అయితే తేడా మాటలే కాదు.. చేష్టలు కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. వేద మంత్రాలు, పచ్చని పందిళ్లు.. శాస్త్రోస్తంగా చేసుకోవాల్సిన ఓ పెళ్లిని ఇక్కడో జంట ఎలా చేసుకుందో చూస్తే మీరే షాకవుతారు. అదేంటో తెలుసుకోవాలంటే మహారాష్ట్ర జాల్నా జిల్లా పరతూర్‌కి వెళ్లాల్సిందే.

మసన్‌జోగి వర్గానికి చెందిన సుభాష్‌ గైక్వాడ్‌ తన కూతురి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. అదే వర్గానికి చెందిన సాహెబ్‌రావ్‌ కుమారుడు ఆకాష్ పెళ్లి కొడుకు. అయితే వీళ్ల పెళ్లి ఘనంగా కాకుండా కాస్త వైవిధ్యంగా చేయాలని వాళ్ల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మసన్‌జోగి వర్గం వాళ్ల వృత్తి కాటికాపరిగా ఉండటం. అందుకే వీళ్ల పెళ్లి కూడా శ్మశానంలోనే చేయాలని ఇరువైపుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. దానికి బాగా చుదువుకున్న వాళ్లు కావటంతో మంజుశ్రీ, ఆకాష్‌లు అడ్డుచెప్పలేదు కూడా.

ఇక ఓ వివాహ వేడుకకి హాజరుకావడానికి అందరూ శ్మశానంలోకి వెళ్లారు. వీరి వివాహం కోసం వైకుంఠధామ్‌ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించి, అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేసి మ‌రీ పెళ్లి జ‌రిపించారు. అక్క‌డ ఒక్క‌టవుతున్న‌ జంట‌ను చూసి అంతా ముందు ఆశ్చర్యపోయి, ఆపై అభినందించారు. ఇంతకీ దీనివల్ల ఒరిగింది ఏంటంటారా? ఓ సందేశాన్ని ఇవ్వ‌డానికే తాము ఇలా శ్మశానం సాక్షిగా పెళ్లి చేశామని పెద్దలు, నూతన వధువరులు చెబుతున్నారు. తమ కర్మభూమిని మరవద్దనే సందేశంతో పాటు కట్నకానుకలు, ఆడంబరాలకు దూరంగా ఉండాల‌ని, మూఢనమ్మకాలపై అవ‌గాహ‌న పెంచుకొని వాటిని త‌రిమేయాల‌ని వారు పిలుపునిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  Graveyard Wedding  

Other Articles