బీజేపి నేత విపరీత పోకడ.. సీఎం తలనరికితే రూ.11 లక్షలు..! BJP leader offers Rs 11 lakh to behead Mamata

Bjp leader offers rs 11 lakh to behead mamata

Bharatiya Janata Yuva Morcha, BJYM, Yogesh Varshney, west bengal CM, Mamata Banerjee, Rs 11 lakh reward, Birbhum district, Hanuman Jayanti rally, hanuman shoha yatra, Muslims, Hindus, social media, West Bengal

A BJP youth leader has announced a bounty of Rs 11 lakh to anyone who beheads West Bengal Chief Minister Mamata Banerjee.

బీజేపి నేత విపరీత పోకడ.. మండిపడుతున్న నెట్ జనులు..!

Posted: 04/12/2017 02:56 PM IST
Bjp leader offers rs 11 lakh to behead mamata

బీజేపి నేతలు విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో వుందికదా అన్న ధీమాతో.. ఇష్టానుసారింగా ప్రవర్తిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు ఓ బీజేని నేత మాయవతిని ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేసిన వైనాన్ని మర్చిపోకముందే.. తాజాగా మరో బీజేపీ యువ విభాగం నేత అలాంటి దారుణమైన ప్రకటనే చేశాడు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగనరికి తీసుకువచ్చిన వారికి రూ. 11 లక్షల నగదు బహుమతి ఇస్తానని ప్రకటన చేశాడు.

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నేత యోగేష్ వార్ష్నే ఈ తరహా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బిర్భమ్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ అనే నినాదాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో, ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో ఎదరుతిరిగి హనుమాన్ భక్తులపై లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనతో బీజేవైఎం నేత యోగేష్ లో అగ్రహం కట్టలు తెంచుకుంది.

అయితే అనుమతి లేని కారణంతో అడ్డుకున్న పోలీసులను వదలి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై తీవ్రవ్యాఖ్యలు చేశాడు యోగేష్. మమతా బెనర్జీ తలను నరికి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. శ్రీరామ నవమి, సరస్వతి పూజలాంటి పండుగలను రాష్ట్రంలో జరుపుకోనివ్వడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఇఫ్తార్ పార్టీలను మాత్రం మమత నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత మద్దతు ముస్లింలకేనని విమర్శించారు. అయితే ఈ ప్రకటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపి నేతల విపరీత పోకడలను నెట్ జనులు తీవ్రంగా పరగిణిస్తున్నారు. కాగా యోగష్ పై పోలీసుల కేసు నమోదు చేసే పనిలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles