ఎన్ కౌంటర్.. మావో టాప్ లీడర్ మళ్లీ మిస్సయ్యాడా? | top Maoist RK again escaped from encounter.

Maoist killed in gun battle between police and ultras in koraput

Koraput Rayagad Encounter, Leleri Forest Encounter, Maoist RK Miss, Andhra Odisha border, Maoist RK Encounter, Maoist RK Again Miss, Maoist Rama Krishna, Maoist Top Leader RK, Andhra-Odisha Border Encounter

An exchange of fire ensued between the Koraput district police and Maoists in Leleri forest situated bordering Rayagada district, killing a rebel this morning. Korpaut SP Charan Singh Meena said top maoist Rama Krishna miss from that and some items used by the rebels have been seized from the encounter spot. The district police raided the area in the Leleri forest on the basis of a tip-off on movement of Maoists in the area, the SP added.

భారీ ఎన్ కౌంటర్... ఆర్కే మళ్లీ మిస్

Posted: 04/12/2017 04:26 PM IST
Maoist killed in gun battle between police and ultras in koraput

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు మరోసారి తుపాకీ మోతతో మారు మోగిపోయింది. బుధవారం మధ్యాహ్న సమయంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ దాడిలో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే తృటిలో తప్పించుకున్నాడని సమాచారం.

రాయగడ్-కోరాపుట్ జిల్లాల సరిహద్దులోని లెలెరీ అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగగా, మధ్యాహ్నానికి ఘటనా స్థలానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. ఘటనలో నలుగురు మావోలు చనిపోగా, వారిలో ముగ్గురు మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.కాగా, ఘటనా స్థలంలో మూడు ఏకే47లు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే మిస్ కావటంతో అదనపు భద్రతాదళాలు రంగంలోకి దిగి కూంబింగ్ చేపట్టాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో, అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేయటంతోపాటు అటవీ ప్రాంత రహాదారులను బ్లాక్ చేసి ముమ్మర గాలింపులు చేస్తున్నారు.

గత అక్టోబర్ లో భారీ ఎన్ కౌంటర్ జరగ్గా ఆర్కే కొడుకు మున్నా సహా 24 మంది మృతి చెందటం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆర్కే గాయాలతో పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకోగా, పోలీసుల అదుపులో ఉన్నాడంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన భార్య శిరీష హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు కూడా చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని విరసం నేతల ద్వారా దౌత్యం పంపటంతో ఆ పిటిషన్ ను ఆమె వాపసు తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Odisha Border  Encounter  RK Miss  

Other Articles