పాలు తాగే వయస్సులో డ్రగ్స్ తీసుకున్న చిన్నారి.. Toddler unconscious after ‘taking parent's heroin'

Toddler found drugged and unconscious on pavement

Alonna Bolden, toddler heroin, toddler drugged, US toddler, US toddler drugged, US toddler unconscious, heroin, Brandy Estep, Jason Bolden, Ohio heroin, drugs, drugs usa, US police, Ohio Police

A toddler Alonna Bolden, who is 18 months old, was found unconscious on a sidewalk after reportedly ingesting her drug addict parents’ heroin.

అర్థరాత్రి తూలుతూ రోడ్డుపై 18 నెలల చిన్నారి..

Posted: 04/11/2017 01:48 PM IST
Toddler found drugged and unconscious on pavement

అగ్రరాజ్యంలో చంటిపిల్లల పెంపకం కూడా వార్తగానే నిలుస్తుంది. అందుకు నిండా 18 మాసాలు కూడా నిండిన ఈ చిన్నారి సంఘటనే తార్కణంగా చెప్పవచ్చు. తల్లికి వున్న ప్రాధాన్యత, భాధ్యతల విషయంలో అక్కడి వారు ఎంతటి విపరీతాలకు వెళ్తున్నారన్న విషయాలకు దర్ఫణం పడుతుంది. తల్లిదండ్రులు వారి జీవనాలే ముఖ్యమని మత్తులో జోగుతున్నారన్న విషయాన్ని ఈ సంఘటన రుజువు చేస్తుంది. తాను ఓ బిడ్డకు తల్లిన విషయాన్ని మర్చిపోయిన తల్లి వల్ల ఆ చిన్నారికి ఎదురైన పరిస్థితితో వారు ఇప్పుడు పోలీసల కేసులను ఎదుర్కొంటున్నారు.

తల్లిదండ్రుల నేరం రుజువైతే వారికి ఏకంగా మూడేళ్ల కారగారవాసం పడుతుంది. ఇక అప్పడు ఆ చిన్నారి ఆలనపాటన ఎవరు చూస్తారు. అన్నది కూడా మరో ప్రశ్నగా మారుతుంది. ఇంతకీ ఏం జరిగింది..? చిన్నారి, వారి తల్లిదండ్రులు ఏం చేశారన్న వివర్లాలోకి వెళ్తే.. సరిగ్గా రాత్రి 12 గంటలు. అంతా చీకటిగా వుంది.. వీదులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆ సమయంలో ఓ చిన్నారి ఇంటి నుంచి బయటకు వచ్చింది. వీధి దీపాల వెలుతురులో.. రోడ్డుపై అటూ ఇటూ తూలుతూ మత్తులో వున్నవారిలా నడవసాగింది. అమెను ఓ మానసిక వికలాంగుడు గుర్తించాడు. తాను పాపవద్దకు వెళ్దామనుకున్నా అతనికి ధైర్యం చాలలేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే చిన్నారిని తన తండ్రి, మరోవ్యక్తి హాస్పిటల్‌కి తరలించారు. అయితే అసుపత్రికి వెళ్తే తమ గుట్టు బయటపడుతుదని భావించిన చిన్నారి త్లండ్రి ముందుగా అంగీకరించలేదు. అయితే చిన్నారి పరిస్థితిని చూసిన తరువాత ఏం జరిగినా ఫర్వాలేదని అసుపత్రికి తీసుకుళ్లాడు. రంగంలోకి దిగన పోలీసులు ఘటనపై విచారణ జరిపి నిజాలు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. బాలికకు హెరాయిన్ డ్రగ్ ఎక్కువ కావడం వల్ల మత్తు ఎక్కిందని, నిద్రపట్టకపోవడంతో రోడ్డుపైకి వచ్చిందని, మత్తుతోనే రోడ్డుపై చాలా దూరం అమాయకంగా నడిచిందని పోలీసులు చెప్పారు.
బాలిక రోడ్డు మీదకు వచ్చిన సమయంలో తల్లికి స్పృహలేదని, డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మత్తులో ఉందని, ఘటన తరువాత వెళ్లి చూసినా అమె ఇంకా మత్తులోనే వుందన్నారు. కాగా చిన్నారి పరిస్థితి మాత్రం కొంత విషమంగానే వున్నా నిలకడగా వుందని, అమెకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వుంచిన వైద్యలు చికిత్సనందిస్తున్నారిని కూడా చెప్పారు. చిన్నారి ప్రాణాలకు అపాయం కలిగేలా ప్రవర్తించినందుకు తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే తల్లిదండ్రులిద్దరికీ సుమారుగా మూడేళ్లు కారాగారవాస శిక్ష పడే అవకావఆలు వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alonna Bolden  toddler heroin  heroin  Ohio heroin  Brandy Estep  Jason Bolden  drugs  drugs usa  

Other Articles