విడాకులిచ్చిన భార్యపై భర్త ‘జరిమానాల’ ప్రతీకారం.. Saudi husband takes fine revenge on his wife

Saudi husband takes fine revenge on his wife

saudi arabia, ex husband, wife, husband piled up fines, wife car, divorce, revenge, traffic fine revenge, samar, traffic authorities, red sea city, jeddah, saudi riyals, husband takes revenge on wife, husband revenge on wife

A saudi husband, who distraught by his wife’s decision to divorce him, has taken revenge by piled up fines against her by using her car in Saudi Arabia.

భార్య విడాకులిచ్చిందని.. భర్త ఇలా చేశాడు..!

Posted: 04/11/2017 12:53 PM IST
Saudi husband takes fine revenge on his wife

విడాకులు ఇచ్చిన తన భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని రగలిపోయిన ఓ భర్త.. అమెను కోట్టకుండా, తిట్టకుండా.. అసలు తాను సీన్ లోకే రాకుండా ఇదంతా జరిగిపోవాలనుకున్నాడు. ఇందుకు ఓ బ్రహ్మాండమైన పథకం వేశాడు. దీంతో తన మాజీ భార్యపై కసి తీర్చుకోవచ్చునని భావించాడు. ఇందులో భాగంగా ఆయన ప్రతీరోజు కారులో తిరుగాడు. కారులో తిరగితే ఆయన ప్రతికారం ఎలా తీరిందా..? అని అనుంకుంటున్నారా... అక్కడే వుంది అసలు విషయం.

ఆ కారు తన భార్య పేరున రిజిష్టర్ అయ్యివుంది. అయితేనేం.. అంటారా..? ఆమె కారులో తిరిగిన అమె మాజీ భర్త.. కారులో ట్రాఫిక్ నిబంధలన్నీ తుంగలో తోక్కాడు. ఆ కారులో రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరిగుతూ.. ట్రాఫిక్ రూల్స్ అన్ని అతిక్రమించాడు. అయితే అక్కడి కెమెరాలు కారు నెంబరును గుర్తించాయి. సమర్ పేరున రిజిస్టర్ అయిన కారు ఏకంగా అనేక పర్యాయాలు ట్రాఫిక్ నిబంధలను ఉల్లఘించాయని గుర్తించాయి. దీంతో ఆ కారు యజమానురాలైన సమర్ కు పోలీసులు జరిమాన లిస్టును పంపించారు.

ఒకటి రెండు కాదు ఏకంగా పేజీల కోద్ది జరిమానా జాబితాను చూసిన సమర్.. ఆ కారు తన పేరున రిజిస్టర్ అయ్యివుందే కానీ. తాను మాత్రం ఎక్కడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పింది. తీరా చూస్తే ఆ మొత్తం విలువ 75,000 సౌదీ రియాల్స్‌. (భారత కరెన్సీ ప్రకారం సుమారు 13 లక్షల రూపాయలు). ఇకసౌదీలో మహిళలు కారు నడపడంపై కూడా నిబంధనలు వున్నాయి. వారు వాహనాలను నడపరాదన్న నిబంధనలు వున్నాయి. అయితే తమ పేరున వాహనాలను రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకోవచ్చు. కానీ, వాటిని కుటుంబంలో మగవాళ్లు మాత్రమే నడుపుతుంటారు.

తాన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడని కారణంగా జరిమానాను కూడా కట్టేది లేదని తేల్చిచెప్పిన సమర్.. ఈ చర్యలన్నీ తన భర్తకు విడాకులు ఇచ్చాననే కోపంతోనే ఆయన చేసినవేనని అనుమానాలను వ్యక్తం చేసింది. తన భర్తతో విడాకులు తీసుకునేందుకు ముందు కొంత సమయం ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామని అప్పటినుంచే తన భర్త చిటికిమాటికి కారులో తిరిగేవాడని తెలిపింది. అప్పుడే ఇది జరిగి ఉంటుందని తెలిపింది. తాను అప్పట్లో ఉద్యోగం కూడా  చేశానని, వాయిదాల ద్వారానే ఆ కారు కొన్నానని చెప్పింది.

అయితే ప్రస్తుతం తాను ఉద్యోగం చేయడం లేదని, జరిమాన చెల్లించే స్థితిలో కూడా లేనని పోలీసులకు చెప్పిన సమర్.. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగిన ప్రతీచోట తన కారులో వున్నది ఎవరన్నది కూడా దర్యాప్తు చేయాలని, తాను అనుమానిస్తున్నట్లు ఈ ఉల్లంఘనలన్నీంటికీ తన భర్తే కారణం అయితే జరిమానాలను కూడా ఆయన అకౌంట్ కే బదిలీ చేయాలని కోరింది. కాగా ఈ తరహా కేసులు ప్రస్తుతం సౌదీలో పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఈ తరహా కేసు ఒకటి నమోదు కాగా, ఇది రెండవదని, ఇలా నేరాలు జరిగితే ఇక తాము కూడా చట్టాల అమలులో మార్పులను తీసుకురావాల్సి వుంటుదని పోలీసులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : traffic fine revenge  samar  traffic authorities  red sea city  jeddah  saudi arabia  

Other Articles