విమానం సీట్లు నిండిపోయాయని.. ప్రయాణికుడ్ని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. United Airlines under fire after passenger dragged from plane

United airlines under fire after passenger dragged from plane

Airplane, Flying, Flight, Plane, United Airways, Travel, Police, Flight Attendant

United Airlines sparked outrage for the treatment of a passenger who was physically dragged off a plane the airline had overbooked,

ITEMVIDEOS: విమానం సీట్లు నిండిపోయాయని.. ప్రయాణికుడ్ని ఈడ్చుకెళ్లిన సిబ్బంది..

Posted: 04/11/2017 11:51 AM IST
United airlines under fire after passenger dragged from plane

విమాన ప్రయాణం చేయాలంటే.. ముందుగానే టిక్కెట్ తీసుకుని చెకిన్ అయిన తరువాత విమానాశ్రయ సిబ్బంది తగు పరశీలనలు అన్ని పూర్తి చేశాక కానీ ప్రయాణికుల‌ను విమానంలోకి ఎక్కేందుకు అనుమతించరు. ఇది దేశీయ విమానాల్లో కానీ లేక విదేశీప్రయాణాల్లో కానీ జరిగే ప్రక్రియ. కానీ అక్కడ మాత్రం ఏదో.. అదేదో ఎర్రబస్సులో సీటు కోసం చేతిరుమాలు వేసినట్లుగా అనిపిస్తుంది. కనీసం మానవత్తం, ప్రయాణికులు అర్జెన్సీని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈడ్చిపారేయడం కలకలం రేపుతోంది.

విమానంలో సీట్లన్నీ నిండిపోయాయని పేర్కొంటూ ఓ ప్రయాణికుడిని అందులోంచి ఈడ్చుకెళ్లిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై ప్రసుతం సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. అయినా తాము బాధిత ప్రయాణికుడికి క్షమాపణలు చెప్పేది లేదంటూ భీష్మించుకుని కూర్చుంటుంది యూనైటెడ్ ఎయిర్ లైన్స్. ప్రయాణికుల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించినా.. సంబంధింత శాఖ అధికారులు మాత్రం ఇంకా చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండడం కూడా గమనార్హం.

షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై స‌ర్వత్రా విమ‌ర్శలు ఎదురవుతున్నాయి. అటు సోషల్ మీడియా యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై విమర్శల వర్షం కురుస్తుంది. కెంటకీలోని లూయిస్‌ విల్లే యునైటెడ్‌ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ఓ ప్రయాణికుడి వ‌ద్దకు వ‌చ్చిన సిబ్బంది ఆయ‌న‌ను దిగాల‌ని చెప్పారు. అయితే, ఆ ప్రయాణికుడు అందుకు ఒప్పుకోలేదు. తాను అర్జెంటుగా వెళ్లాల్సి వుందని అధికారులతో మాట్లాడుతుండగానే విమాన సిబ్బంది అతని చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు. ఆ ప్రయాణికుడు కిందపడిపోయినా అలాగే విమానం బ‌య‌ట‌కు ఈడ్చుక్కెళ్లారు.
 
స‌ద‌రు ప్రయాణికుడు ఆసియా వాసి అని తెలుస్తోంది. తాను వైద్యుడినని, తాను త‌ప్పనిస‌రిగా త‌న స్వస్థలానికి వెళ్లాల‌ని చెబుతున్నప్పటికీ విమాన సిబ్బంది వినిపించుకోకుండా ఈడ్చుకెళ్లారు. అయితే మరోమారు సదరు ప్రయాణికులు విమానంలోకి ఎక్కి తనను చంపేయండీ,  లేదా తీసుకెళ్లండీ అని అరిచినా.. ఫలితం లేకపోయింది. అతన్ని నిర్ధయగా విమానం నుంచి బయటకు పంపించేశారు అధికారులు. అయితే విమానసిబ్బంది దారుణ అగడాలపై ఒక ప్రయాణికుడు తన మొబైల్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airplane  Flying  Flight  Plane  United Airways  Travel  Police  Flight Attendant  

Other Articles