టెర్రరిస్ట్ కాదు... ఆ టీచర్ భర్తే చిన్నారులను కాల్చి చంపాడంట! | Teacher and student killed after husband opens fire.

Teacher boy die when husband opens fire in san bernardino school

San Bernardino, America School Shooting, San Bernardino Gun Fire, San Bernardino Shooter, Husband Fire in School, San Bernardino School Attack, San Bernardino School Gun Fire, Karen Elaine Smith Cedric Anderson, America School Gunfire

Student, 8, and teacher slain in San Bernardino school shooting; gunman kills himself. Police release first images of school 'shooter' and victim.

భార్య మీద కోపంతోనే స్కూల్లో కాల్పులు

Posted: 04/11/2017 09:30 AM IST
Teacher boy die when husband opens fire in san bernardino school

గన్ కల్చర్ చాలా కామన్ గా మారిపోయిన అమెరికాలో మరోసారి తూటా పేలింది. ఈసారి ఓ భర్త తన భార్య మీద ఉన్న కోపంతో ఆమె పని చేస్తున్న స్కూల్ కు వెళ్లి కాల్పులు జరిపాడు. ఇందులో భార్యతోపాటు 8 ఏళ్ల ఓ విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి(9 ఏళ్లు) తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ఫ గాయాలయ్యాయి.

కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో కాజోన్ హైస్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో కరెన్ ఎలైన్ స్మిత్(53) టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె భర్త సెడ్రిక్ ఆండర్సన్ తో(53) విభేధాల కారణంగా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటోంది. ఆమెపై కోపంతో ఉన్న భర్త ఇలా స్కూల్ కు వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరిద్దరికీ ఏడాది క్రితమే వివాహం అయ్యి, ఈ మధ్యే విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. తొలుత దాడి ఉగ్రవాదుల పనిగా భావించిన యాజమాన్యం, అధికారులు భయంతో వణికిపోయారు. సెడ్రిక్ కు ఇదివరకే నేరచరిత్ర ఉందని, గృహ హింస కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. అతని లక్ష్యం విద్యార్థులు కాదని, కేవలం భార్యను చంపాలన్న కసితోనే కాల్పులు జరపగా, గురితప్పి విద్యార్థులకు తగిలి ఉండొచ్చని భావిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : California  San Bernardino  School Gun Fire  

Other Articles